ఫిలిం నగర్ సన్నిధానం లో ఘ‌నంగా ‘క‌ర్మ‌ణి’ మూవీ ప్రారంభోత్స‌వం!

IMG 20250423 WA02021 e1745407655814

నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు ప్రధాన పాత్ర‌ల్లో, ర‌మేష్ అనెగౌని ద‌ర్శ‌క‌త్వంలో, మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని నిర్మాత‌లుగా, రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘క‌ర్మ‌ణి’. ఈ మూవీ తాజాగా ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభ‌మైంది.

ఈ సంద‌ర్భంగా దేవుని చిత్ర‌ప‌టాల‌పై సీనియ‌ర్ న‌టుడు నాగమ‌హేష్ క్లాప్ కొట్టారు. నిర్మాత మంజుల చ‌వ‌న్ కెమెరా స్విచాన్ చేశారు.

IMG 20250423 WA0204

2022లో డైరెక్ట‌ర్ ర‌మేష్ అనెగౌని తెర‌కెక్కించిన‌ ‘మ‌న్నించ‌వా..’ మూవీకి అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆధర‌ణ ల‌భించింది. అదే ఉత్సాహంతో, అదే టీమ్‌తో క‌లిసి చేస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘క‌ర్మ‌ణి’. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో .

ద‌ర్శ‌కుడు ర‌మేష్ అనెగౌని మాట్లాడుతూ.. ”ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో ప్రొరంభోత్స‌వం జ‌రిగే సినిమాలు సూప‌ర్ హిట్ కొడ‌తాయి. ఈ సెంటిమెంట్ మా ‘క‌ర్మ‌ణి’ సినిమాకు కూడా క‌లుగుతుంద‌ని విశ్వాసం ఉంది. మే మొద‌టి వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌ప‌రుస్తాం”. అని అన్నారు.

IMG 20250423 WA0200

నిర్మాత మంజుల చ‌వ‌న్ మాట్లాడుతూ.. ”ఫిలింన‌గ‌ర్ దైవ‌స‌న్నిధానంలో మా ‘క‌ర్మ‌ణి’ సినిమా ప్రొరంభోత్స‌వం జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. మంచి టాలెంట్ ఉన్న టీమ్‌తోనే సినిమా చేస్తున్నాం. ఇండ‌స్ట్రీకి ఒక మంచి సినిమా అందిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాం.” అని అన్నారు.

న‌టీన‌టులు:

నాగ‌మ‌హేష్, రూపాలక్ష్మి, ‘బాహుబ‌లి’ ప్ర‌భాక‌ర్, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు.

సాంకేతిక నిపుణులు: 

బ్యాన‌ర్: రామారాజ్యం మూవీ మేక‌ర్స్, అనంతల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్., నిర్మాత‌లు: మంజుల చ‌వ‌న్, ర‌మేష్‌గౌడ్ అనెగౌని., క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ర‌మేష్ అనెగౌని.కెమెరామెన్: జ‌గ‌దీష్ కొమ‌రి., సంగీతం: జాన్ భూష‌న్., ఎడిట‌ర్: వి.నాగిరెడ్డి., ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్: బ‌ల‌రాం బొమ్మిశెట్టి.కో-డైరెక్ట‌ర్: బిక్షు., పీఆర్వో: క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *