దేవి శ్రీ ప్రసాద్ సినీ పరిశ్రమలో రాక్ స్టార్ గా దూసుకుపోతూ స్టార్ హీరోస్ అందరికీ అదిరిపోయే హిట్ ఆలబమ్స్ ఇచ్చిన సెన్సేషన్ మ్యాజిక్ డైరెక్టర్.
అలాంటి దేవి మీద నటి కరాటే కళ్యాణి సహా పలు హిందు సంఘాలు సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాయి. ఎందుకంటే తాజాగా దేవి శ్రీ కంపోజ్ చేసిన ఆల్బమ్ వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉండటమే ప్రధానమైన కారణం.
దేవీ శ్రీ లేటెస్ట్ గా కంపోజింగ్ అండ్ కొరియోగ్రఫీ చేసిన ఆల్బమ్ పేరు ‘ఓ పారి’. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఆల్బంలో ఏముందంటే ఇందులో ‘హరే రామ , హరే కృష్ణ’ మంత్రాన్ని వాడటమే చిక్కుల్లో పడేలా చేసింది.
సైబర్ క్రైమ్ పోలీసులకు కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదులో పవిత్రమైన ‘హరే రామ హరే కృష్ణ’ మంత్రం పై బికినీ వేసుకుని ఉన్న డాన్సర్స్ తో నృత్యాలు చిత్రీకరించిన దేవి శ్రీ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసిన దేవిశ్రీ ప్రసాద్ హిందు సమాజానికి క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేశారు.
వెంటనే ఆ పాటలోని మంత్రాన్ని తొలిగించాలని… లేనిపక్షంలో దేవిశ్రీ ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కరాటే కల్యాణి వార్నింగ్ ఇచ్చారు.

ఇదే కాదు కాకుండా గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన ‘డీజే దువ్వాడ జగన్నాథం’ లోని లిరిసిస్ట్ సాహితీ రాసిన ‘మడిలొ వొడిలొ బడిలొ గుడిలొ’ పాట మీద కూడా హిందువులు తీవ్రమైన అభ్యంతరాలు తెలియచేశారు.
ఆ వివాదం మీద సినిమా దర్శకుడు ఇచ్చిన క్లారిటీతో ముగిసి పోయింది.

మరి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు పై దేవీ శ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.