KANTARA MOVIE TELUGU RELEASE BY GEETA ARTS:గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా భారీ స్థాయిలో విడుదలకానున్న “కాంతారా” తెలుగు చిత్రం

KANTARA RELEASE TODAY

 

కెజిఫ్, కెజిఫ్-2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మించిన
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరియు రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”.

 “కాంతారా” సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

kantara కన్నడ release date

ఇదివరకే కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.

kantara telugu 1

తెలుగు సినీ ప్రేక్షకుల  కోసం  “కాంతారా” సినిమాను గీత ఆర్ట్స్ బేనర్ లో  తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని “గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా ఈ సినిమాను రేపు భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

KANTARA TEAM 1

“కాంతారా” అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం.

ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.

KANTARA HERO HEROINE 2 e1665588325585

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మించారు.

KANTARA HERO HEROINE 3 e1665588543623

అజనీష్ లోక్‌నాథ్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు.”కాంతారా” చిత్రం రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *