తెలుగు సినీ ప్రేక్షకులకు దీపావళి కానుకగా ఈ శుక్రవారం(october 21 st ) నాలుగు కొత్త సినిమాలు విడుదల ఆయున సంగతి తెలిసిందే.
ఈ నాలుగు సినిమాలూ పర్లేదు అనే టాక్ తెచ్చుకున్నా, వసూళ్లు పరంగా ఆశించిన స్తాయిలో రావట్లేదు.
తెలుగు రాష్ట్రాల్లో 15 న విడుదల అయినా కన్నడ మూవీ ( తెలుగు డబ్బింగ్ ) ‘కాంతార’ జోరుకి మాత్రం కళ్లెం పడలేదు.
‘కాంతార’ చిత్రం 7 వ రోజు థియేటర్ ల సమస్య వలన తక్కువ షోస్ తో కొంచెం కలెక్షన్స్ తగ్గినా 8వ రోజు వచ్చే సరికి షో లు పెరిగి మళ్ళీ పుంజుకొని తెలుగు రాష్ట్రాలలో .1 కోటికి పైగా షేర్ రాబట్టింది.
తెలుగులో సుమారు రూ.2 కోట్ల థియేటర్స్ బిజినెస్ చేసిన ‘కాంతార’ అక్టోబర్ 15న విడుదలై వరుసగా ఆరు రోజుల పాటు ప్రతి రోజు కోటికి పైగా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.
ఏడో రోజైన శుక్రవారం నాలుగు కొత్త సినిమాలు విడుదల కావడంతో రూ.65 లక్షల షేర్ తో సరిపెట్టుకున్న‘కాంతార’ మూవీ.. ఎనిమిదో రోజు మళ్ళీ రూ.1.02 కోట్ల షేర్ తో సత్తా చాటింది.
గత 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.12.39 కోట్ల షేర్ రాబట్టి.. 10 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
నిన్నటి రోజు ఆదివారం, ఈ రోజు దీపావళి కావడంతో ఈ రెండు రోజులు కూడా తెలుగులో కాంతార కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశముంది.
ఈ శుక్రవారం విడుదలైన నాలుగు సినిమాల్లో ‘సర్దార్’ ఒక్కటే కలెక్షన్స్ పరంగా ముందుంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.95 లక్షల షేర్, రెండో రోజు రూ.1.05 కోట్ల షేర్ రాబట్టిన ‘సర్దార్’ చిత్రం.. రెండు రోజుల్లో 2 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక ‘ఓరి దేవుడా’ మొదటి రోజు రూ.90 లక్షల షేర్ రాబట్టినప్పటికీ రెండో రోజు రూ.66 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. దీంతో రెండు రోజుల్లో రూ.1.56 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
అలాగే ‘ప్రిన్స్’ కూడా మొదటి రోజు రూ.90 లక్షల షేర్ రాబట్టినప్పటికీ రెండో రోజు మాత్రం రూ.46 లక్షల షేర్ కి పడిపోయింది. దీంతో రెండు రోజుల్లో రూ.1.36 కోట్ల షేర్ కి పరిమితమైంది.
ఇక ‘జిన్నా’ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతుందని, తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.22 లక్షల షేర్ తో సరిపెట్టుకుందని ట్రేడ్ వర్గాల అంచనా….
ప్రీ రిలీజ్ బిజినెస్ లు చూస్తే సర్దార్ 5 కోట్లు, ప్రిన్స్ సినిమా 6 కోట్లు కు, ఓరి దేవుడా ! సినిమా 4.5 కోట్లు కు, జిన్నా సినిమా 3 కోట్లు రెంజే లో బిజినెస్ చేసినట్లు సినిమా ట్రేడ్ వర్గాల సమాచారం.