KANNADA SHIVARAJ KUMAR GHOST MOVIE LATEST UPDATE:శివరాజ్ కుమార్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఘోస్ట్ (GHOST)దీపావళి పోస్టర్ విడుదల చేసిన టీం !

Shiva rajKumar GHOST POSTER

 

కరుణడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ పాన్ ఇండియా ఫిలిం ‘ఘోస్ట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో  తెరకెక్కుతున్న ఈ యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు.

SHIVANNA ghost first look

ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్, వెనక ఫైర్, స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది .

SHIVA RAJKUMAR HAPPY BIRTHDAY GHOST POSTER

భారీ వేడుకతో ప్రారంభమైన ఘోస్ట్ ప్రస్తుతం రూ 6 కోట్ల వ్యయంతో భారీగా వేసిన జైల్ సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ 24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనున్నారు.

‘ఘోస్ట్’ చిత్రా షూటింగ్ ని నవంబర్ 10 కి మొదటి షెడ్యుల్ పూర్తి చేయనున్నారు. డిసెంబర్ లో రెండో షెడ్యుల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.

GHOST SHIVANNA

‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా  గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు.

పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నిషన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

GHOST SHIVARAJ KUMAR

క్యాస్ట్ & క్రూ:

డాక్టర్ శివరాజ్ కుమార్

ప్రొడక్షన్ :  సందేశ్ ప్రొడక్షన్స్ (29వ చిత్రం)

డైరెక్టర్ : శ్రీని (బీర్బల్)

కెమెరా మాన్ : మహేంద్ర సింహ

సంగీతం : అర్జున్ జన్య

ఆర్ట్ : శివ కుమార్ (కె జి ఎఫ్)

డైలాగ్స్: మస్తీ, ప్రసన్న వి ఎం

పబ్లిసిటీ, పి ఆర్ ఓ: బిఏ రాజు’స్ టీం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *