మూవీ: కల్యాణం కమనీయం
విడుదల తేదీ : జనవరి 14, 2023
నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా భవానిశంకర్, పవిత్ర లోకేష్, దేవీప్రసాద్, సత్యం రాజేష్, కేదార్ శంకర్, సప్తగిరి, సద్దాం తదితరులు
దర్శకుడు : అనీల్ కుమార్ ఆళ్ల
నిర్మాతలు: వంశీకృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి
సంగీత దర్శకుడు: శ్రావణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్: సత్య. జి
కళ్యాణమ కమనీయం సినిమా రివ్యూ (Kalyanam Kamaniyam Movie Review):

యువ టాలెంటెడ్ నటుడు సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ళ ను దర్శకుడు గా ప్రముఖ సంస్థ యువి కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మితం అయిన తాజా మూవీ కళ్యాణం కమనీయం.
ఇప్పటివరకూ వచ్చిన ప్రోమోసనల్ కంటెంట్ చూస్తే సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చింది.
మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకొందో మా 18f మూవీ టీం సమీక్ష లో చదివి తెలుసుకొందామా !
కధ ను పరిశీలిస్తే (story line):

ఉద్యోగం లేకుండా తన తల్లితండ్రుల మీద ఆధారపడి జీవిస్తూ లైఫ్ ని లీడ్ చేస్తున్న శివ (సంతోష్ శోభన్), ఒకానొక సందర్భంలో జాబ్ చేస్తూ లైఫ్ లో సెటిల్ అయిన శృతి (ప్రియా భవాని శంకర్) ని చూసి ప్రేమించడం, అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
అయితే మొదట్లో చక్కగా ఒకరినొకరు అర్ధం చేసుకుని సాగుతున్న వారి లైఫ్ లో చుట్టుప్రక్కల వారి మాటలు, కొన్ని పరిస్థితుల వలన సమస్యలు తలెత్తుతాయి. ఆపైన ఒక ఒకానొక అనుకోని ఘటన వలన వారిద్దరూ విడిపోవలసి వస్తుంది.
శివ ప్రియ ఎందుకు విడిపోవలసి వచ్చింది ?
మళ్ళి వాళ్లిద్దరు కి వచ్చిన కష్టం ఏమిటి ?
తల్లితండ్రుల పాత్ర ఏమిటి ?
మరలా శివ ప్రియ కలిసారా లేదా ?
కలిస్తే ఎలా కలిశారు? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎంటనే కావాలి అంటే సినిమా థియేటర్ కి వెళ్ళి చూడండి. లేదు ఇలాంటివి చాలా సినిమాలలో చూసాము ఈ సినిమా తర్వాత అయిన చూద్దాం అనుకొంటే ఓటీటీ లో వచ్చే వరకూ ఆగడం మంచిది.
కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):
ఈ మూవీలో పెద్ద మైనస్ ఏమన్నా ఉంది అంటే అది దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ళ రాసుకొన్న కధనం (స్క్రీన్ ప్లే ) మాత్రమే. ఈ కథని తెరకెక్కించిన విధానం మార్చి ఉంటే బాగుండేది. నిజానికి ఈ కధా పాయింట్ పాతదే అయినా, కథనాన్ని కూడా అదే విధంగా సింపుల్ గా తెరక్కించారు.
కథనంలో ఏ మాత్రం కొత్తదనం ఆసక్తికర అంశాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు ఆడియన్స్ కి గత సినిమాలను గుర్తు చేస్తూ నీరసం తెప్పిస్తాయి. సినిమాలో చాలా సీన్స్ ఆల్రెడీ చూసిన తెలిసిన భావన ఆడియెన్స్ కి కలుగక మానదు.
అలాగే రన్ టైం తక్కువ అయినప్పటికీ సినిమా సీన్స్ ఇంకా ఆకట్టుకునే విధంగా ఎమోషనల్ గా చూపించి ఉంటే ఓ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండేది.
కానీ ఈ సినిమాలో చాలా అంశాలు డల్ గా స్లో నేరేషన్ లో సాగడం వలన సినిమా మీద పెద్దగా ఇంటరెస్ట్ ఏర్పడదు.
దర్శకుడు, నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

దర్శకుడు అనిల్ కుమార్ విషయానికి వస్తే.. తాను స్వీయ అనుభవం లోనుండి ఇంటరెస్టింగ్ లైన్ ని పట్టుకున్నారు. కానీ కథనాన్ని ఇంకా మంచి సీన్స్ తో మరింత ఆసక్తికరంగా రాసుకుని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది. కొన్ని సీన్స్ మినహా మిగతా సినిమా నరేషన్ అంతా చాలా ఫ్లాట్ హీరో హీరోయిన్ పాయింట్ లోనే సాగడం చాలా స్లో గా అనిపిస్తుంది.
హీరో సంతోష్ శోభన్నే కళ్యాణం కమనీయం మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. సంతోష్ శోభన్ మంచి నటుడుగా మరోసారి నిరూపించుకున్నాడు. సినిమా సినిమా కి నటనలో మెట్యూరిటీ సాదిస్తూ మంచి ప్రమిసింగ్ హీరో గా మారుతున్నాడు. ఇంకా సరైన కథలు పడితే అతని కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది.
హీరోయిన్ గా ఈ మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయిన ప్రియా భవానీశంకర్ తన నటన తో ఆకట్టుకోంది. తనకు తెలుగు లో మంచి సినిమాలు రావచ్చు.
సంతోష్ శోభన్ ప్రియ భార్య భర్తలుగా వారిద్దరూ తమ తమ పాత్రల్లో ఎంతో బాగా పెర్ఫార్మ్ చేసారు. కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరి నటన ఎంతో సహజంగా ఉండడంతో పాటు రియలిస్టిక్ ఫీల్ ని ఆడియన్స్ కి అందించారు.
ఇక మెయిన్ లీడ్ తో పాటుగా కీలక క్యారెక్టర్స్ లో కనిపించిన దేవీప్రసాద్, సత్యం రాజేష్, పవిత్ర లోకేష్, కేదార్ శంకర్ ల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

చిత్ర నిర్మాతలైన యువి కాన్సెప్ట్స్ వారి నుండి వచ్చిన ఈ మూవీ యొక్క నిర్మాణ విలువలు బాగున్నాయి. చిన్న సినిమా అయినా లుక్స్, నిర్మాణం విషయంలో రాజీపడకుండా నిర్మించారు. కెమెరా మ్యాన్ గా వర్క్ చేసిన కార్తీక్ ఘట్టమనేని పనితనం ఎంతో బాగుంది. సాంగ్స్ తో పాటు అక్కడక్కడా కొన్ని సీన్స్ లో ఫొటోగ్రఫీ మరింత బాగా ఆకట్టుకుంది.
సంగీతం దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ అందించిన రెండు సాంగ్స్ సిట్యువేశనల్ పర్వాలేదనిపించడం మూవీకి మంచి బలం. రెండు సాంగ్స్ విజువల్ గా బాగున్నాయి.
ఎడిటింగ్ విభాగం పనితీరు బాగుంది, అందుకే పక్కాగా లెంగ్త్ ని కట్ చేసి సీన్స్ సెట్ చేసారు. ఎడిటింగ్ విభాగం బాగానే వర్క్ చేసారు.
డైరెక్టర్ ఇంకా మెప్పించేలా నరేషన్ ని ఎంగేజింగ్ గా చూపించి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది.
18f మూవీస్ టీం ఒపీనియన్:

సంతోష్ శోభన్, ప్రియా భవానీశంకర్ ల కళ్యాణం కమనీయం మూవీ సరదాగా సాగిపోయినా ఆడియన్స్ ని ఆకట్టుకోదు. హీరో హీరోయిన్స్ తో పాటు కీలక పాత్రధారుల పెర్ఫార్మన్స్, కొన్ని సీన్స్ లో విజువల్స్, ముఖ్యంగా తక్కువ రన్ టైం లు సినిమా ను బోర్ లేకుండా చూపించే అంశాలు,
కధా దర్శకుడు అనిల్ కుమార్ ప్రధానంగా తీసుకున్న కథని ఆడియన్స్ కి నీరసం తెప్పించేలా నడిపిన విధానం పెద్ద మైనస్ గా మారింది. తాను ఇంకా మంచి సన్నివేశాలతో చిత్రాన్ని ప్రెజెంట్ చేసి ఉంటే ఈ వారాంతనికి ఇది కూడా మంచి సినిమా గా ప్రేక్షకులకు ఓకే చాయిస్ గా ఉండేది,
ప్రస్తుత సంక్రాంతి టైమ్ రిలీజ్ కూడా సినిమాకి ప్లస్ అవ్వదు ఎందుకంటే అక్కడ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఇదే టికెట్ ధరకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి. ఓటీటీ లేదా టివి లో అయితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయవచ్చు.
టాగ్ లైన్:కల్యాణం బాగున్నా .. అంత కమనీయం గా సాగలేదు.
18f Movies రేటింగ్: 2.5/ 5
* కృష్ణ ప్రగడ.
