Kalyan Ram’s DEVIL Movie Review & Rating: కల్యాణ్ రామ్ డెవిల్ గా ప్రేక్షకులను మెప్పించాడా ?

devil review by 18F movies 12 e1703845635376

మూవీ: డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ 

విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023,

నటీనటులు: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్. సంయుక్త మీనన్, శ్రీకాంత్ అయ్యంగార్, మాళవిక నాయర్, సత్య, అజయ్ తదితరులు,

దర్శకుడు : అభిషేక్‌ నామా, నిర్మాత: అభిషేక్‌ నామా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్, ఎడిటర్: తమ్మిరాజు.

devil review by 18F movies 11

డెవిల్ మూవీ రివ్యూ (Devil Movie Review):

నందమూరి కళ్యాణ్ రామ్ కు బింబిసార షూటింగ్ టైమ్ లోనే శ్రీకాంత్ విస్సా చెప్పిన  డెవిల్ కధ నచ్చి తను హీరోగా బింబిసార లో నటిస్తున్న సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఈ డెవిల్ చిత్రం లో కూడా నటీంపచేసారు. డెవిల్ సిన్మా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్, పాటలు, టీజర్, ట్రైలర్, పోస్టర్లు ఇలా అన్నీ కూడా సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.

కళ్యాణ్ రామ్ కి బింబిసార లాంటి బ్లాక్ బూస్టర్ హిట్ వచ్చిన తర్వాత మంచి హైప్ మీద ఉన్న NKR కి అమిగోస్ లాంటి మరో ఎక్స్పెరిమెంటల్ సినిమా వచ్చి కొంచెం నిరాశ పరిచినా, డెవిల్ ప్రోమోషనల్ కంటెంట్ కి వచ్చిన బజ్ తో  ఎన్నో ఆశలతో ఈ ఇయర్ ఎండింగ్ కి మంచి కమర్సి యల్ హిట్ పాడాలని ప్లాన్ చేసి, ఈ  శుక్రవారం రోజు డెవిల్ సిన్మా విడుదల చేశారు.

మరి ఈ డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్  సినిమా తెలుగు సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మా 18F మూవీస్ టీం సమీక్ష లో చదివి తెలుసుకుందామా !

devil review by 18F movies 10

కధ పరిశీలిస్తే (Story Line): 

1954 సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర పోరాట సమయం లో సుభాష్ చంద్ర బోస్ ని టార్గెట్ చేస్తూ బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీ జరిపిన సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో జరిగిన కథగా చూపించడం జరిగింది. ఇందులో ఒక్క బోస్ తప్ప మిగతా పాత్రలు అన్ని కల్పితం అని మేకర్స్ పేర్కొనడం జరిగింది. ఇక మెయిన్ కధ లోకి వెళ్తే మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. ఈ హత్యని జమీందారే చేశాడు అంటూ అక్కడి పోలీస్ జమీందారుని అరెస్ట్ చేస్తారు.

ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ని రాసపాడు పంపిస్తారు మద్రాసు ప్రెసిడెన్సీ అదికార్లు . ఆ రాసపాడు జమీందారు కుటుంబంలో జరిగిన హత్య ఎవరు చేశారో  డెవిల్ విచారణ చేస్తూ,ఈ కేసులో అరెస్ట్ అయిన జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)ను ఓ కంట కనిపెడుతుంటాడు.

devil review by 18F movies 9

కొన్ని ఆ శక్తి కరమైన ట్విస్టులు తర్వాత..

సీక్రెట్ ఏజెంట్ అయిన డెవిల్, హత్య విచారణ కోసం ఎందుకు రావాల్సి వచ్చింది ?,

అదే విధంగా రాసపాడు జమ్మి లోనే ఆ హత్య ఎందుకు జరిగింది ?,

ఆ హత్య జరిగిన బంగ్లాలో ఉంటున్న నైషధ (సంయుక్త మీనన్) ఎవరు ?,

ఆమెను డెవిల్ ఎందుకు టార్గెట్ చేశాడు ?, డెవిల్ ఆమెను ప్రేమించాడా ? లేక నమ్మించాడా ?,

ఇంతకీ.. నైషధ కి నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటి ?,

అసలు ఈ కేసుకు, బోస్‌‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి?

ఈ కథలో సుభాష్ చంద్రబోస్‌కు రైట్ హ్యాండ్ అయిన త్రివర్ణ ఎవరు?

మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి?

సముద్ర (వశిష్ట), షఫీ (షఫీ), జబర్దస్త్ మహేష్ (శేఖర్) పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

చివరికి డెవిల్ (కళ్యాణ్ రామ్) బ్రిటిష్ ఏజెంట్ నా లేక ఇండియన్ ఏజెంట్ నా ?

అసలు డెవిల్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు ?

అనే ఆశక్తికార ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే వెంటనే మీ దగ్గరలోని దియేటర్ కి వెళ్ళి డెవిల్ సిన్మా చూసేయండి.

devil nama

కధనం పరిశీలిస్తే (Screen – Play):

డెవిల్ సిన్మా కి వ్రాసుకొన్న  కధలో మెయిన్ పాయింట్ బాగున్నా, కధనం ( స్క్రీన్ ప్లే) విషయంలో కొన్ని చోట్ల స్లో అనిపించింది. కానీ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ పాలన సెటప్ మాత్రమే కొత్తగా అనిపిస్తుంది. 1945 ప్రాంతాన్ని ఎంచుకోవడం, సుభాష్ చంద్రబోస్ అనే పాయింట్ చుట్టూ కథనాన్ని (స్క్రీన్ ప్లే ) నడిపించడం మాత్రమే కొత్తగా అనిపిస్తుంది.

ఇంకా చెప్పుకుంటూ పోతే కథను రాసుకున్న తీరు, దీనికి క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ను యాడ్ చేసేందుకు అన్నట్టుగా హత్య జరగడం, ఆ కేసును చేదించే క్రమంలో ఒక్కో పాయింట్ ఆడియెన్స్‌కు రివీల్ అవుతుంటాయి. ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకొనే పాయింట్ ఉన్నా, తెరపై సిన్మా చూస్తుంటే ఆ థ్రిల్ మాత్రం ఆవిష్కృతం కాలేదు. ఇలాంటి కధ వస్తూ గల చిత్రాలు మామూలుగా అయితే ప్రేక్షకుడికి కొంచెం దేశ భక్తి కలిగి, తర్వాత సీన్ ఏంటి అంటూ ఊపిరి బిగపట్టుకుని చూసేలా ఉండాలి.

కానీ ఈ డెవిల్ సినిమాను మాత్రం దియేటర్ మొత్తం పూర్తిగా రిలాక్స్ అవుతూ చూస్తూ ఉన్నారు ప్రేక్షకులు. అంత నీరసంగా, నెమ్మదిగా సాగుతుంటుంది కధనం.  కధ లో కనిపించిన ఎమోషనల్ జర్నీ ని ఇంటరెస్టింగ్ కధనం తో  తీయడంలో పూర్తి వైఫల్యం దర్శకుడిదే లేదా స్క్రీన్ రైటర్ ది  అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ వైఫల్యాన్ని ఎవరు తీసుకుంటారు.. ఎవరికి ఆపాదిస్తారన్నది చూడాలి.

ఇంకా డెవిల్ మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) కథనం విషయంలో రాజీ పడకుండా లెంత్ (నిడివి) తగ్గించి ఉంటే బాగుండేది.  రెండవ అంకం ( సెకండాఫ్) లో కూడా  సినిమా జరుగుతున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను ఇంకా పెంచగలిగే స్కోప్ ఉన్నపటికీ స్క్రీన్ ప్లే రైటర్, ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే సెకండ్ హాఫ్ ను కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం చేశారు గాని, కొన్ని చోట్ల అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రీ క్లైమాక్స్ వరకూ ఇంటెరెస్ట్ గా సాగినా, అది అక్కడితో ఆగిపోయింది. క్లైమాక్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

devil review by 18F movies 1

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

ఈ డెవిల్ సినిమా కి అసలైన దర్శకుడు ఎవరు అనే చర్చ ని పక్కన పెడితే, ఇలాంటి కధ లు వెండి తెర మీదకు తీసుకు రావాలి అంటే ఆధిక  ఖర్చుతో పాటూ రీసెర్చ్ కూడా చాలా అవసరం. ఇప్పటి సోషల్ మీడియా యూత్ ఇలాంటి పిరియాడిక్ చిత్రాలలో ఎక్కడ చిన్న తప్పు జరిగినా ఎంటనే పసిగట్టేస్తారు. సీనియర్ టెక్నీషియన్స్ పనిచేయడం వలన సిన్మా రిచ్ నెస్ ఉంది.

రచయిత శ్రీకాంత్ విస్సా రాసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నాయి. మొత్తమ్మీద నిర్మాతల కృషి, దర్శకుడి ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది. ఈ డెవిల్ చిత్రంలో యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో బాగానే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల లెంత్ వలన నిరాసక్తత కలిగింది.

నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు హిట్ మరియు ప్లాప్ లతో సంభందం లేకుండా కొత్త కధలకు ప్రదాన్యత ఇస్తూ నటించడం నిజంగా గ్రేట్.  ఇప్పుడు కూడా తన గత చిత్రాల కంటే భిన్నంగా బ్రిటిష్ నేపథ్యంలో ఈసారి మైండ్ గేమ్ యాక్షన్ డ్రామాతో సీక్రెట్ ఏజెంట్ గా వచ్చాడు.

ఈ డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ తన లుక్స్ తో పాటూ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో త్రివర్ణ పాత్రకు సంబంధించి రివీల్ అయ్యే ట్విస్ట్, ప్రధాన యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

devil review by 18F movies 8

హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చాలా  అమాయక రాలుగా చక్కగా నటించింది. కళ్యాణ్ రామ్ తో నడిచే ప్రేమ సన్నివేశాలు, హీరో  హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఓక అమాయక యువతి గా కనిపిస్తూ, తనకు అప్పజెప్పిన మిషన్ ని కంప్లీట్ చేసే పోరాట యోధురాలిగా కూడా బాగా నటించి మెప్పించింది.

మరో కీలక పాత్రలో నటించిన మాళవిక నాయర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. సందర్భానుసారంగా ఆమె పలికించిన హావభావాలు బాగున్నాయి. ఈ చిత్రానికి మరో ప్రధానాకర్షణ నేతాజీ పాత్ర చుట్టూ స్క్రీన్ ప్లేను నడపడం. ఇక విలన్ గా నటించిన బ్రిటిష్ నటులు కూడా బాగానే నటించారు.

కమెడియన్ సత్యతో పాటు శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్, రంగస్థలం మహేష్, సఫీ, ఎస్టార్  మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అభిషేక్ పిక్చర్స్ కూడా ఖర్చుకి ఎక్కడ తగ్గకుండా అప్పటి వాతావరణాన్ని, ఫీల్ ని చాలా రిచ్ గా వచ్చేలా నిర్మించారు. VFX కూడా బాగున్నాయి.

devil review by 18F movies 5

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం విషయానికి వస్తే, పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం మాత్రం చాలా  చోట్ల సీన్స్ యొక్క మూడ్ ని ఎలివేట్ చేసింది అని చెప్పవచ్చు.  ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో అయితే గుస్బంప్స్ వచ్చేలా చేశాడు. అప్పటి మూడ్ కూడా క్యారి అయ్యింది. పాటల్లో ‘మాయే చేసి…’ విడుదలకు ముందు సూపర్ హిట్ అయ్యింది.

సౌందర్ రాజన్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ లుక్ లో కనిపించింది. కానీ కలర్ టీన్త్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకవపోయింది. 1940 లో ఈస్టమెన్ కలర్ ఉండేది కాబట్టి, గ్రేడింగ్ లో ఇంకా కొంచెం ఢీమ్ కలర్స్ వాడిఉంటే బాగుండేది.

తమ్మిరాజు ఎడిటింగ్ బాగానే ఉంది. కానీ సినిమా నిడివి తగ్గిస్తే  మరింత రేసీగా ఉంటూ థ్రిల్స్, సస్పెన్స్ & మిస్టరీ మరింత వర్కవుట్ అయ్యేవి. చూస్తున్న ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం లో లోపం ఎవరిదో దర్శకుడు, ఎడిటర్ డిసైడ్ చేసుకోవాలి.

నిర్మాత అభిషేక్‌ నామా ఈ డెవిల్ సినిమాకు భారీగా ఖర్చు చేశారని తెరపై చూస్తే ఈజీగా చెప్పవచ్చు. డబ్బులు ఖర్చు చేసే విషయంలో నిర్మాతగా అభిషేక్ నామా రాజీ పడలేదు. అయితే, యాక్షన్ సన్నివేశాల్లో మరింత దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైటులో  యాక్షన్ షాట్స్ తేలిపోయాయి.

devil review by 18F movies

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

కథానాయకుడు కళ్యాణ్ రామ్ ‘డెవిల్’గా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. సినిమా కథా నేపథ్యం బావుంది. ప్రారంభంలో పాత్రల పరిచయానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, ప్రీ – ఇంటర్వెల్ నుంచి కధనం లో వేగం పెరిగి దర్యాప్తులో ఉన్న థ్రిల్ మరియు ట్విస్టులు వర్కవుట్ అయ్యాయి. కధ మీద, నటి నటుల నటన మీద ఆసక్తి మొదలైంది.

మిస్టరీ డ్రామాలను, పిరియాడిక్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళితే  హ్యాపీగా చూసి రావచ్చు. కళ్యాణ్ రం నటన, అప్పటి వాతావరణం ప్రేక్షకులను ఆకట్టుకొంటాయి.

మర్డర్ మిస్టరీ తో కూడిన యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘డెవిల్’, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్  యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతాయి.  కళ్యాణ్ రామ్ తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో స్పై ఏజెంట్ గా  మెప్పించాడు. ఐతే, రొటీన్ స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలు స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫ్లో కి మైనస్ గా మారాయి.

ఓవరాల్ గా ఈ స్పై థ్రిల్లర్ యాక్షన్ చిత్రంలో మెయిన్ పాయింట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి.  యాక్షన్ ఇస్తాపడే  ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా బ్రిటిష్ పాలన భారత దేశం లో ఎలా సాగిందో తెలుసుకోవాలి అంటే దియేటర్ కి  వెళ్ళి చూడవచ్చు.

చివరి మాట: డెవిల్ డి కోడ్ చేసే విధానం బాగుంది !

18F RATING: 3 /5

   * కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *