వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 ఎడి రిలీజ్ ఎప్పుడు ? ఎన్ని పార్టులు గా వస్తుంది అనే టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియా లొ హాల్ చాల్ చేస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ “కల్కి 2898ఎడి” మే 9 విడుదల అంటూ కొన్ని నెలల క్రితమే మేకర్స్ ఆఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం కల్కి 2898 ఎడి సినిమా కి సంభందించి ఒక షెడ్యూల్ షూట్ యూరప్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షూట్ లొ డార్లింగ్ ప్రభాస్ దిశా పఠాని పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ ఫోటోలు కూడా విడుదల చేశారు.
ఇంతకీ కల్కి సినిమా ఎన్ని పార్ట్ లుగా చేస్తున్నారు, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది మొదటి పార్ట్ నా లేక సెకండ్ పార్ట్ నా అనేది అఫిషియల్ గా చెప్పక పోయినా అందుతున్న సమాచారం ప్రకారం, సాంగ్ షూట్ జరుగుతుంది అది కూడా మే లొ రిలీజ్ అవుతున్న కల్కి గురించే అని తెలిసింది.
మరి ఈ చిత్రం షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా కంప్లీట్ చేసుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని ఆన్ టైం రిలీజ్ డేట్ కి మేకర్స్ సర్వత్రా కష్టపడుతున్నారు.
ఈ కల్కి సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ ఈ మార్చ్ నుంచే స్టార్ట్ చేస్తున్నట్టుగా గత నెలలో న్యూస్ వచ్చింది. అయితే ఇప్పుడు మార్చ్ వచ్చినా కూడా ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేసినట్టు కనిపించలేదు.
కల్కి టీమ్ నుండీ వస్తున్న సమచారం ఏంటంటే ఇంకో రెండు రోజులలో యూరప్ షూట్ కంప్లీట్ చేసుకొని హైదరబాద్ వచ్చి ప్రమోషన్స్ స్టార్ట్ చెస్తారు అని తెలిసింది. దీని ప్రకారం ఈ చిత్రం మార్చ్ ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ నెల ఎండ్ నుండీ మే 9 వరకు ఒకో ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ కల్కి 2898AD చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం, వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ దీపిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
చూడాలి మొదట అనుకొన్న డేట్ కి డార్లింగ్ ప్రభాస్ సినిమాలు ఏది రిలీస్ అవుతూ లేదు. ఈ కల్కి ఆ సెంటిమెంట్ నీ క్రాస్ చేస్తూ మే 9 న విడుదల అవుతుందా! . ఇంతకీ కల్కి 2898 ఎడి ఎన్ని పార్ట్ లు అనేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.