డార్లింగ్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో వైజయంతీ మూవీస్ ప్రతిష్టత్వమకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కల్కి2898AD . ఈ చిత్రం ను అనౌన్స్ చేసిన తొలి రోజు నుండి సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది.
దర్శకుడు నాగ ఆశ్వాన్ మొదటిసారిగా ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ, పాన్ వరల్డ్ మూవీ గా నిర్మిస్తుండటం తో ఈ మూవీ పై ఆంచానాలు బాగా పెరిగాయి. వైజయంతీ మూవీస్ కూడా తమ 50 వ చిత్రం కావడం తో సినిమా ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసారు.
అయితే ఈ చిత్రం లో డార్లింగ్ ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ సినిమా పై ఆంచానాలు పెంచారు కానీ, రిలీస్ డేట్ పై క్లారిటీ లేకుండా ఉన్నారు.
నిన్ననే, ఈ చిత్రం నుండి బిగ్ B అమితాబ్ పాత్ర పరిచయ వీడియొ ని అశ్వథ్థామ ఇంట్రో వీడియో ను రిలీజ్ చేయగా, ఆడియెన్స్ నుండి అద్భుత రెస్పాన్స్ వస్తోంది. వీడియో క్వాలిటీ నుండి, అమితాబ్ రోల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సోషల్ మీడియా లో ఆడియెన్స్ ఫిదా అవుతూ షేర్స్ మీద షేర్స్ చేస్తూ నిన్న ఈవెనింగ్ నుండి కల్కి -అశ్వథ్థామ ని ట్రెండింగ్ లో పెట్టారు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్,ప్రపంచ సినీ ప్రేక్షకులకు త్వరలోనే కల్కి- 2898AD సినిమా ద్వారా మాంచి ట్రీట్ ను అందించనున్నారు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ రాగా, ఈ అమితాబ్ బచ్చన్ రోల్ కి సంబందించిన వీడియో మరింత అంచనాలను పెంచేసింది అని చెప్పాలి.
అన్ని బాషల్లో కూడా ఒకేసారి గా ప్రమోట్ చేస్తూ, అందరి దృష్టిని ఆకర్షించేలా మేకర్స్ చేస్తున్న ప్లాన్ కూడా సూపర్ అనే చెప్పాలి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ కల్కి-2898AD చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. డిస్థిబూటర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కల్కి2898AD సినిమా మే 30 విడుదలకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.
మూవీ మేకర్స్ అయిన వైజయంతీ నుండి ఇంకా అఫిసియల్ కన్ఫర్మ్మెసన్ రావలసి ఉంది.