Kaliyugam Pattanamlo Movie Heroine Special Interview:  ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్ స్పెషల్ ఇంటర్వ్యూ!

IMG 20240328 WA0144 scaled e1711650263234

 నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.

ఈ క్రమంలో హీరోయిన్ ఆయుషి పటేల్ మా 18F మూవీస్ మిడియా ప్రతినిధితో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలను మి కొసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.

 ‘కలియుగం పట్టణంలో’ మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా ఉండదు. ఒక్కో సీన్‌లో ఒక్కోలా ప్రేక్షకులకు అనిపిస్తుంది. నా పాత్రకు ఇంటర్వెల్‌లో ఒకలా, క్లైమాక్స్‌లో మరో ఒపీనియన్ వస్తుంది.

IMG 20240328 WA0226

 ‘కలియుగం పట్టణంలో’ అవకాశం ఎలా వచ్చింది? సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది?

చిన్నతనం నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. ఆయనలానే ఎదగాలని అనుకునేదాన్ని. ఈ మూవీ నాకు ఓ మేనేజర్ వల్ల వచ్చింది. ఈ మూవీ కోసం ఎన్నో వర్క్ షాప్స్ చేశాం. ఆ టైంలోనే హీరో విశ్వతో కలిసి ఎన్నో సీన్ల గురించి చర్చించుకున్నాం.

 ‘కలియుగం పట్టణంలో’ మూవీ కోసం కడపలో షూటింగ్ చేయడం ఎలా అనిపించింది? 

కడపలో అందమైన లొకేషన్స్ చాలా ఉన్నాయి. అక్కడి ప్రజలు ఎంతో సపోర్ట్ చేశారు. అక్కడ ఈ చిత్రాన్ని ఎంతో సరదాగా షూట్ చేశాం. చాలా పార్ట్ అక్కడే షూట్ చేశాం. కొంత మాత్రం హైద్రాబాద్‌లో షూట్ చేశాం.

IMG 20240328 WA0142

 ‘కలియుగం పట్టణంలో’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తోంది?

ప్రస్తుతం మేం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం టూర్స్ వేస్తున్నాం. వెళ్లిన ప్రతీ చోటా మంచి రెస్పాన్స్ వస్తోంది. మమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారు. మా సినిమా టీజర్, ట్రైలర్ గురించి చెబుతున్నారు. మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కూడా నా గురించి, నా ఫస్ట్ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

 ‘కలియుగం పట్టణంలో’ దర్శకుడు రమాకాంత్ రెడ్డితో పని చేయడం ఎలా అనిపించింది? 

రెండు గంటలకు పైగా నాకు కథను నెరేట్ చేశారు. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంది. మా దర్శకుడు ఎప్పుడూ కూడా కట్ చెప్పరు. కట్ చెబితే ఎండ్‌లో వచ్చే ఎక్స్‌ప్రెషన్స్ మిస్ అవుతాయ్ అని కట్ చెప్పరు. మా దర్శకుడు ఎంతో సరదాగా షూటింగ్ చేసేవారు. కథ ఏం చెప్పారో.. అదే తీశారు. ఆర్ఆర్ వల్ల సినిమా మరోస్థాయికి వెళ్లింది.

IMG 20240328 WA0190

 ‘కలియుగం పట్టణంలో’ నిర్మాతల గురించి చెప్పండి?

‘కలియుగం పట్టణంలో’ సినిమా కోసం కడపలో షూట్ చేసినప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. మా అందరినీ చక్కగా చూసుకున్నారు. సినిమాకు ఎంత ఖర్చైనా కూడా వెనుకాడలేదు. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు. మంచి సినిమా తీశాం.. దాన్ని ఎలాగైనా జనాల్లోకి తీసుకెళ్లాలని మా నిర్మాతలు తపన పడుతుంటారు.

 విశ్వ కార్తికేయ పక్కన నటించడం ఎలా అనిపించింది?

విశ్వ కార్తికేయ నాకు ఎంతో సహకరించారు. ప్రతీ సీన్ గురించి చర్చించుకునేవాళ్లం. ఇలా చేద్దాం.. అలా చేద్దాం అని మాట్లాడుకునేవాళ్లం. ఇంత మంచి వ్యక్తితో నా మొదటి సినిమా రావడం ఆనందంగా ఉంది.

IMG 20240328 WA0225

 తదుపరి చిత్రాల గురించి చెప్పండి?

కలియుగం పట్టణంలో రిలీజ్ కాకముందే నాకు మూడు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చాయి. లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ వంటివి నాకు నచ్చదు. అందుకే చాలా సినిమాలు ఒప్పుకోలేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటున్నాను. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి రాలేదు. కొన్ని సినిమాలు చేసినా పర్లేదు.. మంచి చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.

ఒకే థాంక్యూ అండ్ అల్ ది బెస్ట్ ఆయుషి పటేల్..

  *కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *