Kajal Agarwal’s SATYA BHAMA Movie Release update:  కాజల్ అగర్వాల్  సత్యభామ గా నటిస్తున్న సినిమా టీజర్  దీపావళి కి రిలీజ్ !

satya bhama kajal e1699109163458

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న కొత్త సినిమా “సత్యభామ”. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. “సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా

satya bhama e1699109371291

నిర్మాత బాబీ తిక్క మాట్లాడుతూ: – మా “సత్యభామ” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్ లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాల తో పాటు
యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాము. దీపావళి సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” టీజర్ రిలీజ్ చేస్తాం. వచ్చే సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ “సత్యభామ”గా మిమ్మల్ని ఆకట్టుకుంటారు. అన్నారు

satya bhama teaser

నటీనటులు:

కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర,తదితరులు

టెక్నికల్ టీమ్: 

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్, స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి, కో ప్రొడ్యూసర్ – బాలాజీ, సినిమాటోగ్రఫీ – జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, పీఆర్ఓ: జీఎస్ కే మీడియా, దర్శకత్వం: సుమన్ చిక్కాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *