కబాలి ఫేమ్ సాయి ధన్సిక నటించిన ‘అంతిమ తీర్పు’ మూవీ టీజర్ రిలీజ్

Anthima teerpu e1686052300348

కబాలి ఫేమ్ సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌, అమిత్‌ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఎ. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టీజర్ విడుదల చేసారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Anthima teerpu 5

నిర్మాత మాట్లాడుతూ ‘‘కిడ్నాప్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథ ఇది. ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్, పాటలకు చక్కని స్పందన వచ్చింది.

Anthima teerpu 4

కబాలీలో రజనీకాంత్ కి కూతురుగా నటించనిన సాయి ధన్సిక నటన సినిమాకి హైలైట్ అవుతోంది. విమలా రామన్ పవర్ఫుల్ పాత్ర పోషించారు. అలాగే ఇతర పాత్రధారులకు నటనకు చక్కని స్కోప్ ఉంది.

Anthima teerpu 3

కోటి గారు ప్రతి పాటకు చక్కని స్వరాలు అందించారు. ఇటీవల విడుదల చేసిన ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్‌ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదే ఉత్సాహంతో ‘త్వరలో ట్రైలర్లు విడుదల చేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.

నటీనటులు:
సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌, అమిత్‌ తివారీ, దీపు, సత్య ప్రకాశ్‌, నాగ మహేశ్‌ తదితరులు.

Anthima teerpu 2

సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఎస్‌.సుధాకర్‌ రెడ్డి
సంగీతం: కోటి
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
స్టంట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, దేవరాజ్‌
కొరియోగ్రఫి: ఈశ్వర్‌ పెంటి
ఛీప్‌ కో డైరెక్టర్‌: బండి రమేష్‌
పి.ఆర్‌.ఓ: మధు విఆర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *