KA ప్రొడక్షన్స్ న్యూ మూవీ లో హీరో రామ్ చరణ్!

IMG 20250708 WA0354 e1751979214930

షార్ట్ ఫిలింస్ స్థాయి నుంచి హీరోగా తనకొక స్థాయి సంపాదించుకునే వరకు ఎదిగారు కిరణ్ అబ్బవరం. ఈ క్రమంలో ఫిలింమేకింగ్ లో ఆయన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు చూశారు. ఎవరి సపోర్ట్ లేకుండా గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రాంగ్ కంటెంట్, ఇన్నోవేటివ్ మేకింగ్ తో మూవీస్ చేస్తున్నారు.

ఒక్క ఛాన్స్ కష్టాలు తెలిసిన హీరో కాబట్టే తనలా ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలుస్తానని దిల్ రూబా సినిమా ఈవెంట్స్ లో చెప్పారు కిరణ్ అబ్బవరం. చెప్పినట్లే తన మాట మీద నిలబడుతూ కొత్త వాళ్లతో తన సొంత బ్యానర్ పై మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారాయన.

తన గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌ గా పనిచేసిన రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు కిరణ్ అబ్బవరం. తన మూవీస్ కు ఆన్‌లైన్ ఎడిటింగ్ చేసిన టెక్నీషియన్‌ను దర్శకుడిగా అవకాశం కల్పిస్తున్నారు. నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో ఎమోషనల్ డ్రామాగా మంచి కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేయనున్నారు. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించనున్నారు. తను నడిచొచ్చిన దారిని మర్చిపోని కిరణ్ అబ్బవరం కెరీర్ ప్రారంభంలో తనతో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ నే తమ కొత్త మూవీస్ కు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొత్త వారితో సినిమాలు చేయాలనే గొప్ప లక్ష్యంతో కిరణ్ అబ్బవరం ముందడుగు వేస్తున్నారు.

ఈ మూవీ గురించి కిరణ్ అబ్బవరం స్పందిస్తూ – ప్రతి ప్రయాణం ఒక కలతో మొదలవుతుంది. ఆ కల నిజమవుతుందో లేదో ప్రయాణం మొదలుపెట్టినప్పుడు తెలియదు. ఏడేళ్ల కింద ఒక పట్టుదల, డ్రీమ్ తో సినిమా పరిశ్రమలో నా జర్నీ స్టార్ట్ చేశాను.

  ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ఆదరణతో గుర్తింపు సంపాదించుకున్నాను. నాలాగే ఒక కలతో సినిమా‌ పరిశ్రమకు వచ్చే యంగ్ టాలెంట్ కు మా కేఏ ప్రొడక్షన్స్ ద్వారా అవకాశాలు అందించాలని ప్రయత్నిస్తున్నాం.

ఈ నెల 10న ఈ సినిమా అనౌన్స్ చేస్తున్నాం. నా జర్నీలో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *