మూవీ: జోరుగా హుషారుగా,
విడుదల తేదీ : డిసెంబర్ 15, 2023
నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సోను ఠాకూర్, సిరి హనుమంతు, మధునందన్, సాయి కుమార్, రోహిణి, బ్రహ్మాజీ తదితరులు.
దర్శకుడు : అను ప్రసాద్
నిర్మాతలు: నిరీష్ తిరువీధుల
సంగీతం: ప్రణీత్ మ్యూజిక్
సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగుల
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
జోరుగా హుషారుగా రివ్యూ ( JORUGA HUSHARUGA Movie Review):
బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటించిన తాజా సినిమా జోరుగా హుషారుగా. ఈ శుక్ర వారమే దియేటర్స్ లోకి వచ్చింది. ఇటీవల రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నబేబీ చిత్ర నటుడు విరాజ్ అశ్విన్ కి యువతలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
అన్ని పాసిటివ్ అంచనాలతో జోరుగా హుషారుగా అంటూ యువ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సంతోష్ (విరాజ్ అశ్విన్). మరి ఈ సినిమా ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి చూద్దామా !.
కధ పరిశీలిస్తే (Story Line):
ఊర్లోని చేనేత కుటుంబానికి చెందిన సంతోష్ (విరాజ్ అశ్విన్) హైదరాబాద్‌లోని ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉండే వ్యక్తి. అతని స్నేహితురాలు, నిత్య (పూజిత పొన్నాడ), ఆఫీసులో అతని టీమ్ లో చేరి అనంతరం టీమ్ లీడర్ గా మారి అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. దానితో సంతోష్ బాస్ అయిన ఆనంద్ (మధునందన్) నిత్యను ఇష్టపడటం ప్రారంభించిస్తాడు, అక్కడి నుండి పరిస్థితులు క్లిష్టంగా మారతాయి.
సంతోష్ పేరులోని సంతోషం తో జోరుగా హుషారుగా సాగిపోతుంది అనుకొన్న పర్సనల్ లైఫ్ లోకి తన మేనేజర్ అయిన ఆనంద్, తను ఇష్ట పడుతున్న నిత్య ని ఇష్టపడటం సంతోష్ కి బాధ కలిగిస్తుంది. లవర్ భాదలో ఉన్న సంతోష్ కి మరోవైపు తన తండ్రి తన చదువు కోసం, ఇల్లు గడవడం కోసం చేసిన అప్పుని తీర్చాల్సి ఉంటుంది.
ఇలాంటి క్లిష్ట పరిస్తుతులలో పడిన సంతోష్ లైఫ్ జోరుగా సాగిందా ?,
సంతోష్ తను ప్రేమించిన నిత్య ప్రేమను పొందాడా ?,
తండ్రి కి ఉన్న అప్పు సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు ? ,
ఇంతకీ నిత్య ఎవరిని ప్రేమిస్తుంది? సంతోష్ భాదను అర్దం చేసుకుందా ?
చివరకు సంతోష్ లైఫ్ జోరుగా హుషారుగా సాగిందా లేక బేజారు అయ్యిందా ?,
అనే ప్రశ్నలకు సమాధానమే ఈ జోరుగా హుషారుగా సిన్మా కధ, కధనం. ఈ ప్రశ్నలు మీకు కూడా నచ్చితే సమాధానాలు కోసం వెంటనే మీ దగ్గరలోని దియేటర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ లవర్స్ ని వెంట పెట్టుకుని వెళ్ళి చూసేయండి. ఈ ప్రశ్నలు ఇంటరెస్ట్ కలిగించక పోతే మరో మూడు లేదా నాలుగు వారాలు ఆగితే మీ మొబైలు లోనే చూడవచ్చు.
అంతవరకు ఆగడం ఎందుకు సినిమా గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మా 18F మూవీస్ టీం వ్రాసిన సమీక్ష చదివి తెలుసుకోండి!
కధనం పరిశీలిస్తే (Screen – Play):
జోరుగా హుషారుగా సిన్మా కి సరిపోయే కధ మరియు కధ యొక్క బాక్ డ్రాప్ బాగున్నా.. మొదటి అంకం (ఫస్ట్ ఆఫ్ ) చివరకు వచ్చేటప్పటికి స్టోరీ యొక్క ప్లాట్ ఓపెన్ అయిపోతుంది. ఇలా మొదటి అంకం లోనే కధ ప్రేక్షకులు ఊహించే విధంగా ఉంటే రెండవ అంకం (సెకండ్ ఆఫ్ )లో బోర్ ఫీల్ అవుతారు. ఈ సిన్మా కధనం (స్క్రీన్ – ప్లే ) ఓపెన్ డ్రామా ఫార్మెట్ లో సాగడం ఈ సిన్మా కి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు.
దియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుల దురదృష్టమో ఏమో కానీ రెండవ అంకం (సెకండ్ హాఫ్) హుషారు తగ్గి నెమ్మదిగా సాగుతూ నిరుత్సాహపరుస్తుంది, మరింత ఆకర్షణీయమైన కథనం రాసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది. రచయిత మరియు దర్శకుడు అయిన అను ప్రసాద్ ఈ కధ కి తగ్గ కధనం రాసుకొనే తప్పుడు మరింత శ్రద్ధ కనబరచాల్సింది.
సాయి కుమార్ మరియు రోహిణి మొల్లేటిల నటనా ప్రతిభను, సినియారిటీ ని మరింతగా ఉపయోగించుకోవాల్సింది. ఎందుకంటే ప్రస్తుత కధనం లో వారి పాత్రలు పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపే విధంగా తక్కువ సీన్లుతో ఉన్నాయి. తండ్రి (సాయి కుమార్) కొడుకు (విరాజ్) ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలకు మరింత లోతైన డైలాగ్స్ అవసరం.
సాయి కుమార్- విరాజ్ ల మధ్య ప్రభావవంతమైన సన్నివేశాలను రూపొందించి వారి పాత్రల యొక్క భావోద్వేగాలని ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ చేసి ఉండాల్సింది. కానీ, దర్శకుడు కధకుడిగా ఫెయిల్ అయ్యాడా లేక రచయిత రాసిన కధను దర్శకుడిగా సరిగా తియ్యలేక పోయాడా అనేది దర్శక- రచయిత అను ప్రసాద్ కె తెలియాలి.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
అను ప్రసాద్ దర్శకుడిగా, రచయితగా మంచి కధను రాసుకోవడం లో ప్రతిభని బాగానే ప్రదర్శించినప్పటికీ, కొన్ని సీన్ల లొని కధనం మరి ఫోర్స్డ్ గా ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలలో వచ్చే భావోద్వేగాలు కృత్రిమంగా ఉండి ఆడియన్స్ ని కనెక్ట్ చేయవు.
విరాజ్ అశ్విన్ బేబీ సిన్మా తరహాలోనే ఈ మూవీలో కూడా మరొకసారి ప్రేమికుడి పాత్రలో కనిపించాడు. విరాజ్ తన పాత్రలో ఒదిగిపోయి అద్భుత యాక్టింగ్ చేయడంతో పాటు ఆకట్టుకునే డ్యాన్స్ లతో కూడా అలరించాడు. మంచి ఈజ్ తో యూత్ ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. బేబీ సిన్మా లొని పాత్ర యొక్క నెగిటివ్ ఎనర్జీ ని ఈ జోరుగా హుషారుగా సంతోష్ పాత్ర తో పాసిటివ్ గా మార్చుకొనే ప్రయత్నం చేశాడు.
పూజిత పొన్నాడ, తన కూల్ మరియు బబ్లీ పర్సనాలిటీతో స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించడమే కాకుండా మంచి స్క్రీన్ ప్రెజెన్స్‌ని కూడా ప్రదర్శిస్తుంది. విరాజ్ అశ్విన్‌తో ఆమె కెమిస్ట్రీ మూవీకి బాగా ప్లస్ అవుతుంది.
సినీయర్ నటులు సాయి కుమార్, రోహిణి మరియు బ్రహ్మాజీ తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు. మధునందన్ మరియు రాజేష్ ఖన్నా తమ పాత్రలలో మంచి నటనను ప్రదర్శించారు, అలానే కామెడీ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నారు. విరాజ్ అశ్విన్‌తో మధునందన్ చేసిన హాస్య సన్నివేశాలు మంచి నవ్వులు పూయిస్తాయి. మిగిలిన పాత్రదారులు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు ప్రణీత్ మ్యూజిక్ బాగానే ఉంది. బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పరవాలేదు. సాంగ్స్ విశయం లో ఇంకా బాగా ట్రై చేసి వుండవలసినది. ఒక్క సాంగ్ కూడా ఆకట్టుకొనేలా లేదు.
మహి రెడ్డి పండుగుల సినిమాటోగ్రాఫర్ బాగుంది. చాలా సీన్స్ లొని షాట్స్ కి మంచి రిచ్‌నెస్ ని జోడించారు.
మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు కానీ ముఖ్యంగా క్లైమాక్స్ భాగంలో మరింత క్రిస్ప్ గా ఎడిట్ చేస్తే కొంచెం స్లో నేసస్ తగ్గేది. నిర్మాత నిరీష్ తిరువీధుల పాటించిన నిర్మాణ వాల్యూ ఉన్నంత లో బాగానే ఉంది.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
బేబీ బోయ్ విరాజ్ అశ్విన్ పూజిత పొన్నాడ జంటతో సాగిన జోరుగా హుషారుగా కధనం సరైన ఎగ్జిక్యూషన్ లేకుండా సింపుల్ లవ్ డ్రామా గా సాగిపోయింది. జోరుగా హుషారుగా టైటిల్ విని ఎంతో హుషారుగా ఉంటుంది అనుకొన్న ఈ మూవీలో కొంచెం హాస్యం మరియు ప్రధాన పాత్రల నుండి వచ్చే ఎంతో కొంత నటన బాగున్నాయి.
ముఖ్యంగా విరాజ్ అశ్విన్ లో మంచి నటుడు ఉన్నాడు అనేది బేబీ సిన్మా ప్రూవ్ చేసినా ఈ సిన్మా లో కూడా విరాజ్ నటన మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే గ్రిప్పింగ్ లేని ముందే తెలిసిపోయే సన్నివేశాలు, భావోద్వేగంలో ప్రోపర్ ఎమోషన్ లోపించడం వంటివి ఈ జోరుగా హుషారుగా సాగిపోవాలి అనుకొన్న సిన్మా యూనిట్ కి ప్రతికూల అంశాలుగా మారతాయి అని చెప్పాలి.
ఓవరాల్ గా ఫ్రీ టైమ్ ఉంటే లవర్స్ , యూత్ ఫ్రెండ్స్ సరదాగా హుషారుగా దియేటర్ కి వెళ్ళవచ్చు. మీరు ఫీల్ అయ్యే దానిమీద జోరు ఆదారిపడి ఉంటుంది.