జాన్ సే సినిమా అప్డేట్: క్రైమ్ థ్రిల్లర్ ‘జాన్ సే…’ నుండి ప్రణయ్ గా అంకిత్ ఫస్ట్ లుక్ విడుదల

IMG 20221225 WA0044 e1671982408375

 

క్రితి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా ఎస్. కిరణ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ‘జాన్ సే’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కిరణ్ కుమార్ అందిస్తున్న ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.

YAS వైష్ణవి సమర్పిస్తున్న ఈ చిత్రం లో థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

IMG 20221225 WA0045

జాన్ సే...’ టైటిల్ లో ఉన్న మూడు డాట్స్ సినిమాలో కీలకమైన ముగ్గురి పాత్రలను ప్రతిబింబిస్తున్నాయి. అందులో మొదటి డాట్, పాత్రను క్రిస్మస్ పర్వదినాన టీం పరిచయం చేశారు. హీరో అంకిత్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ప్రణయ్ పాత్రలో కనిపించే అంకిత్ ఈ చిత్రంలో లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తారు. ఉత్కంఠ రేపే థ్రిల్లింగ్ అంశాలతో జాన్ సే… ఆద్యంతం ప్రేక్షకులను అలరించేలా సాగుతుంది. ఈ చిత్రం తప్పకుండా థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు కిరణ్ కుమార్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

IMG 20221225 WA0056

ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో ప్రముఖ సీనియర్ ఆక్టర్లతో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కిస్తున్నారు. జాన్ సే చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు.

జనవరి మొదటి వారంలో ఫస్ట్ సాంగ్ ను సిల్లీ మాంక్స్ ఆడియో ద్వారా విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి సమ్మర్ స్పెషల్ గా అయిదు భాషల్లో విడుదల చేయనున్నారు.

*నటీనటులు:*

అంకిత్, తన్వి, తనికెళ్ళ భరణి, సుమన్, బెనర్జీ, అజయ్, సూర్య, భాస్కర్, రవి వర్మ, వంశీ, అంజలి, శంకర్ మహతి, అయేషా, ప్రశాంత్, శ్రీ వల్లీ, రవి శంకర్, లీల, రవి గణేష్, రమణి చౌదరి, కిరణ్ కుమార్, ఏ కే శ్రీదేవి, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ

*సాంకేతిక నిపుణులు:*

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం – ఎస్. కిరణ్ కుమార్

సంగీత దర్శకుడు – సచిన్ కమల్

ఎడిటర్ – ఎం ఆర్ వర్మ

లిరిక్స్ – విశ్వనాథ్ కరసాల

డి ఓ పి – మోహన్ చారీ

డైలాగ్స్ – పి మదన్

పి ఆర్ ఓ – బి ఏ రాజు ‘s టీం

ఆడియో – సిల్లీ మాంక్స్ మ్యూజిక్

పబ్లిసిటీ డిజైన్స్ – ఏ జె ఆర్ట్స్ (అజయ్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *