5 భాష‌ల్లో తెరకెక్కిన‌ M4M మూవీ విడుదలకు సిద్ధం! 

IMG 20241130 WA0199 e1732968132860

మూవీ మేక‌ర్ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కుడిగా, జో శర్మ (యూఎస్ఏ) హీరోయిన్‌గా తెర‌కెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా అంద‌రికి క‌నెక్ట్ అయ్యే స‌బ్జెక్టుతో తెర‌కెక్కించామ‌ని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసిన‌ట్టు తెలిపారు.

రాబోయే ప‌దేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటార‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

IMG 20241130 WA0201

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ”ఇటీవ‌ల ‘ఎంఫోర్ఎం’ మూవీ హిందీ ట్రైలర్ ప్రతిష్టాత్మక గోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA) ఆధ్వ‌ర్యంలో విడుద‌ల చేయ‌డంతో సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింద‌ని, అంచ‌నాలు భారీగా పెరిగాయన్నారు. ఎక్సలెంట్ టీంతో సినిమాను ఎంతో అద్భుతంగా పూర్తి చేశామన్నారు.

హీరోయిన్ జో శర్మ త‌న ఫ‌ర్మార్మెన్స్‌తో సినిమాకు హైలైట్‌గా మారింద‌ని డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల తెలిపారు. హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించామ‌ని, క‌థ‌, క‌థ‌నాల‌ను న‌మ్ముకునే సినిమాను తీశాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల ఆస‌క్తిక‌ర‌మైన కాంపిటీష‌న్ ప్ర‌క‌టించారు.

విడుద‌లైన‌ ఫ‌స్ట్ డే ఈ సినిమా చూసి ఇందులో కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే ఒక్కోక్క‌రికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

IMG 20241130 WA0205

హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. నేను ముందుగా బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మోహన్ వడ్లపట్ల గారికి. నాకు గాడ్‌ఫాద‌ర్ ఆయ‌న‌. నాకు మంచి అవ‌కాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం అమెరికా నుంచి హైద‌రాబాద్‌కు ఈ ఏడాదే ఆరు సార్లు వ‌చ్చాను.

నేను ఇందులో ఇన్విస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్టుగా చేశాను. క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌తో న‌డిచే ఈ సినిమా.. చూస్తున్నంత సేపు ఊపిరి బిగబెట్టేలా ఉంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా చూసిన వాళ్లంద‌రి ఫీలింగ్ ఇదే. సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.

IMG 20241120 WA0172

ఈ సంద‌ర్బంగా గోవా తీరంలో హీరోయిన్ జోశర్మ (USA) తళుక్కుమంటూ ఈ వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. M4M మూవీ ట్రైలర్ గోవాలో లాంచ్ చెయ్యడం కొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటూ ఆనందం వ్య‌క్తం చేసింది.

ఇలాంటి కాన్సెప్ట్ 110 ఏళ్ల సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్ అని, తాను ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయ‌డం గ‌ర్వంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకనిర్మాత మోహన్ వడ్లపట్లకు, IMPPA ప్రముఖులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

IMG 20241130 WA0203

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో తెర‌కెక్కింది ఈ సస్పెన్స్ థ్రిల్లర్. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమాను త్వ‌ర‌లోనే 5 భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు.

బ్యానర్: మోహన్ మీడియా క్రియేషన్స్, In Association with McWin Group USA.

తారాగణం:

జో శర్మ (ప్రధాన నటి) (USA), సంబీత్ ఆచార్య (ప్రధాన నటుడు), శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్

సాంకేతిక సిబ్బంది:

కథ: మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల, జో శర్మ, స్క్రీన్ ప్లే: మోహన్ వడ్లపట్ల, రాహుల్ ఆడబాల , దర్శకత్వం: మోహన్ వడ్లపట్ల, డైలాగ్స్: శ్రీచక్ర మల్లికార్జున,, సంగీతం: వసంత్ ఇసాయిపెట్టై, డిఓపి: సంతోష్ షానమోని, స్టంట్స్ : యాక్షన్ మల్లి,, ఎడిటింగ్: పవన్ ఆనంద్, మిక్సింగ్: విష్ణు వర్ధన్ కాగిత, కార్తికేయ స్టూడియో, డిఐ: రత్నాకర్ రెడ్డి, కలర్ లాజిక్స్,  విఏఫ్ఎక్స్: కొత్తపల్లి ఆది, వెంకట్సౌండ్ డిజైనర్: సాగర్, దర్శకత్వ శాఖ: రాహుల్ అడబాల, శ్రీచక్ర మల్లికార్జున, హరి కిషన్, సుభాష్ సిరిపెల్లి, గోవింద్, రాజు, వెంకట్, వంశీ,  పిఆర్ ఓ: పర్వతనేని రాంబాబు, కడలి రాంబాబు, దయ్యాల అశోక్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *