Jithender Reddy Review :కామ్రేడ్స్ తూటాలకు బలైన స్వయం సేవక్ జితేందర్ రెడ్డి సైన్మా ఎలా ఉందంటే !

IMG 20241107 WA02431 e1731008969887

చిత్రం: జితేందర్ రెడ్డి ,

నటీనటులు : రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాశ్.,

దర్శకత్వం : విరించి వర్మ,

నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి

ఎడిటర్ : రామకృష్ణ అర్రం,

సినిమాటోగ్రఫీ : వి. ఎస్. జ్ఞాన శేఖర్,

సంగీతం : గోపీ సుందర్,

మూవీ: జితేందర్ రెడ్డి రివ్యూ  (Jithender Reddy Movie Review) 

భారతీయ సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ ట్రెండ్  ప్రేక్షకులఆధారణ తో పాపులర్ అయ్యింది. సినీ కధ రచయితలు, దర్శకులు  స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, నక్సలైట్స్, గ్యాంగ్ స్టర్స్ వంటి వివిధ వ్యక్తుల జీవితం ఆధారంగా రాస్తున్నారు, చిత్రాలు నిర్మించి మంచి ఆదరణ కూడా పొందుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే జగిత్యాల ప్రాంతం లొని ఒక నాయకుడి జీవిత కధ ఆధారంగా నిర్మించిన  “జితేందర్ రెడ్డి” చిత్రం 8వ తేదీన విడుదల కానుంది.

విడుదలకు నాలుగు రోజుల ముందే  కొన్ని ప్రాంతాలలో ప్రేక్షకులు ప్రీమియర్ షోలు చూసి చాలా బాగుంది ఆ చెప్తున్నారు. మా 18 F మూవీస్ టీం కూడా నిన్ననే ఈ జితేందర్ రెడ్డి మూవీ ప్రీమియర్ చూసి ఈ సమీక్ష రాశారు. మా రివ్యూ టీం మరియ కొందరి మీడియా ప్రతినిదులు చెప్పిన మాటలలో ఈ జితేందర్ రెడ్డి మూవీ ఎలా ఉందంటే !

IMG 20241019 WA0240

కధ పరిశీలిస్తే (Story Line): 

జితేందర్ రెడ్డి చిత్రం 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. జితేందర్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల కుటుంబంలో జన్మిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి దేశం, ప్రజల కోసం పనిచేయాలని తపన పడుతుంటారు. ఒక రోజు నక్సలైట్స్ చేత హత్యకు గురైన ఒక కుర్రాడిని చూసి ఆయనకు విపరీతంగా కోపం వస్తుంది. దీంతో, జితేందర్ రెడ్డి నక్సలైట్స్ పై పోరాటం చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఈ సినిమా కథలో ఆయన నక్సలైట్స్ పై ఎలా పోరాడారో చూపిస్తారు. బడుగు బతుకుల బాగు కోసం, దొరల కొమ్ములను తమ తుపాకీలతో నేలకొరిగేలా చేసిన ‘అన్నల తూపాకీ తూటా’…రానూరానూ గురితప్పి గతితప్పిందా?, వారి ఉనికి కోసం సమాజంలోని కొందరి సానుభూతిపరులను తమ స్వార్థానికి వాడుకుని జీవితాలను అడవిపాలు చేసిందా?, నక్సలిజం ముసుగులో అడవిలోని అన్నలు గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకోవడం దేనికి?,

జాతీయవాదులు రవన్న, గోపన్నల గుండెల్లో దూరిన అన్నల తూటాలు జితేందర్‌రెడ్డిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చాయి?, ప్రజల పక్షాన ఉండాల్సిన నక్సలైట్లు….ప్రజాక్షేమం కోరే జితేంతర్‌రెడ్డి, అతని అనుచరులను ఎందుకు చంపాలని అనుకుంటారు?, జితేందర్‌రెడ్డికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గన్‌మ్యాన్‌… నక్సల్స్ మూకుమ్మడి దాడి నుంచి తప్పించుకుని ఏం చేస్తాడు?,

జాతీయవాదిగా నక్సలిజంపై ఉక్కుపిడికిలి బిగించిన జితేంతర్‌రెడ్డి… రాజకీయ ప్రవేశం చేసేలా దారితీసిన కారణాలు ఏంటి?, జగిత్యాల టైగర్‌ ఎవరంటే కొన్నిదశాబ్దాలుగా మార్మోగుతున్న జితేందర్‌రెడ్డి పేరు…ప్రజలమనస్సుల్లో వేళ్లూనుకుపోయేలా చేసిన సంఘటనలేంటి?, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే జితేందర్‌రెడ్డి చిత్రం టాకిసులలో తప్పక చూడాల్సిందే.

IMG 20241021 WA0180

కధనం పరిశీలిస్తే (Screen – Play):

తెలుగు చిత్రాల్లో కామ్రేడ్స్ ను హీరోలుగా చూపించే విదానం మాదాల రంగ రావు, టి కృష్ణ నుండి ఆర్ నారాయణ మూర్తి వరకూ ఎందరో దర్శకులు చేశారు.  కానీ “జితేందర్ రెడ్డి” చిత్రంలో నక్సలైట్స్ చీకటి కోణాలను, వారి అక్రమాలను బయటపెట్టి తెరపై చూపించారనే చెప్పోచ్చు. 1980వ దశకంలో నక్సలైట్స్ ప్రజల కోసం పోరాడుతున్నట్టు చెప్పినప్పటికీ, వారు అశాంతిని, పీడిత వర్గాలను మరింత పీడించారని చూపించారు.

జితేందర్ రెడ్డి సామాజిక కార్యకర్తగా తన ప్రస్థానం ప్రారంభించి, కాలేజీ రాజకీయాలు, ఆర్ఎస్ఎస్, పీడిఎస్‌యూ మధ్య పోరాటం, ఆ తర్వాత నక్సలైట్స్ పై పోరాటం వంటి అంశాలు కధ గా బాగున్నా కధనం ( స్క్రీన్ ప్లే ) లోకి వచ్చేసరికి కొన్ని సీన్లు డాక్యుమెంటరీ లా ఉన్నాయి.  వస్తవిక కథలంటూ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో కాస్తోకూస్తో హాస్యాన్ని జోడిస్తున్నా జితేందర్‌రెడ్డి సినిమాలో మచ్చుకైనా నవ్వుకోవడానికి ఏ సన్నివేశమూ కనపడకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు.

సీరియస్ గా నడుస్తున్న సినిమా మధ్యలో ఉన్నపళంగా గ్రూప్ సాంగ్ వచ్చిపోవడం కధనం లో మైనస్ అనే చెప్పాలి.  ఓవరాల్ గా కధ రాజకీయాలు, అదీపత్యం దొరనిలో సాగుతుంది కాబట్టి, సామాన్య ప్రేక్షకులు దృష్టి మారాల్చకుండా సినిమా చూడవచ్చు.

IMG 20241021 WA0178

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

డైరెక్టర్‌ విరించి వర్మ ఉయ్యాల జంపాలా అనే లవ్‌స్టోరీతో  దర్శకుడిగా తెరంగేట్రం చేసి, నానితో మజ్ఞు లాంటి సినిమానూ తెరకెక్కించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నా మజ్ను సినిమా తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత  తెలంగాణ ప్రాంత పొలిటికల్ లీడర్‌ జితేందర్‌రెడ్డి కథతో రావడం విశేషం. లవ్ స్టోరీలు  తీసిన విరించి వర్మ ఈ సినిమా ఎలా హ్యాండిల్ చేస్తాడా అనుకున్నారు గానీ, జితేందర్‌రెడ్డి  సినిమా దర్శకుడిగా విరించి వర్మ కు మంచి మార్కులే పడ్డాయి.

రాకేష్ వర్రే “జితేందర్ రెడ్డి” పాత్రలో అదరగొట్టాడనే చెప్పోచ్చు. ఆయన గతంలో కొన్ని లవ్ స్టోరీలు చేసినప్పటికీ, ఈ చిత్రంలో ఆయన యాక్షన్ డ్రామాలో మంచి నటన చూపించారు. స్వయంసేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ నటన చాలా బాగుంది.

 హీరోయిన్‌ రియా సుమన్‌ తనకి ఇచ్చిన పాత్రలో చక్కగా వదిగిపోయింది. మంచి నటన తో మంచి మార్కులే కొట్టేసింది. జితేందర్ రెడ్డి ఫ్రెండ్స్ పాత్రలలో నటించిన నటులు చాలా వరకూ కొత్తవారు నటించడం వలన ఆ పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు.

మిగిలిన పాత్రలలో రవి ప్రకాశ్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రల పరిది మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

వి.ఎస్. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా న్యాచురల్ గా ఉన్నాయి.

గోపీసుందర్ మ్యూజిక్ లో మెరుపులు లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమా మూడ్ కి తగ్గట్టు ఉంది.

ఎడిటర్  రామకృష్ణ అర్రం ఎడిటింగ్ పరవాలేదు. కొన్ని లెన్త్ ఎక్కువ ఉన్న సీన్స్ ఇంకా ట్రిప్ చేసి ఉంటే బాగుండేది.

నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. కానీ ఇంకా తెలిసిన నటి నటులతో తీసిఉంటే జితేందర్ రెడ్డి మూవీ ప్రేక్షకులకు బాగా గుర్తు ఉండేలా ఉండేది.

IMG 20241106 WA0096

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

1980 వ దశకం తెలంగాణ ప్రాంతం లొని కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల చుట్టుపక్కల కొన్ని ఊర్లకు జితేందర్ రెడ్డి కథ తెలిసిందే. ఏ చరిత్ర కారుడు లికించని జితేందర్ రెడ్డి కధని ఇప్పటి యువతకు తెలియజేయాలని జితేందర్ తమ్ముడూ రవీందర్ రెడ్డి స్వయం సేవక్ గా గట్టి సంకల్పం తో ఖర్చుకి వెనుకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. ఓవైపు లెఫ్టిస్టులు, మరోవైపు బీజేపీ, ఆరెస్సెస్‌… మధ్యలో టీడీపీ పాత్రలు ఉండటంతో మున్ముందు ఈ మూవీ కాస్త వివాదాల్లో చిక్కుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు క్రిటిక్స్.

మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) జితేందర్ రెడ్డి బాల్యం, కాలేజీ బ్యాక్ డ్రాప్, కాలేజీలో ఎలా లీడర్ గా ఎదిగాడు అని చూపించారు దర్శకుడు. ఇక  రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో జితేందర్ రెడ్డి పొలిటికల్ గా ఎడగాలి అనుకొన్నప్పుడు జిత్తు  వర్సెస్ నక్సలైట్లు, జితేందర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అని తెరమీద చూపించారు.

సాంకేతికంగా సినిమా చాలా బాగా తీసినప్పటికి కొన్ని చోట్ల డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. హీరో పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నా తక్కువ ఎలివేషన్స్ తోనే సరిపెట్టేశారు. క్లైమాక్స్ మాత్రం అదిరిపోతుంది. సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర, వాజ్ పేయి పాత్ర సీన్స్ మాత్రం సినిమాని లేపాయి అనుకోవచ్చు.

జితేందర్ రెడ్డిని నక్సలైట్లు చుట్టుముట్టి ,  72 బులెట్లు శరీరంలోకి దింపి చంపారు అని జితేందర్ రియల్ ఫొటోలు సినిమా రోలింగ్ టైటిల్స్ లో చూపించడం గమనార్హం. అతనితో పాటు రియల్ గా చనిపోయిన పలువురు ఫొటోలు, పేపర్ వార్తలు కూడా సినిమాలో చూపించి , జితేందర్ జీవిత చరిత్ర తెలుసుకోవాలి అని ఆసక్తి  కలిగేలా చేయడం నిజంగా హాట్సాప్. దియేటర్ లో ఉన్న 90% మంది ప్రేక్షకులు నిలబడి రోలింగ్ టైటిల్స్ లో వస్తున్న ఫోటోలు చూస్తూ మాట్లాడు కోవడం అదృష్టం.

IMG 20241106 WA0121

చివరి మాట: శరీరంలోకి 72 బుల్లెట్స్ దూసికెళ్లినా చరిత్ర లో ఒక పేజీ కూడా లేని నాయకుడు జితేందర్ రెడ్డి !

18F RATING: 3.25 / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *