Jitender Reddy Trailer Review: జితేందర్ రెడ్డి ట్రైలర్ కు అనూహ్య స్పందన ! సిన్మా విడుదల ఎప్పుడంటే! 

IMG 20240503 WA0125 scaled e1714727223826

ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి గారు నిర్మాతగా ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి.

1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు మరియు రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

గతంలో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్ సినిమా పైన అంచనాలను పెంచేసాయి. కాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు.

చిన్నప్పటినుండే సమాజం పట్ల అంకితభావం ఉన్న జితేందర్ రెడ్డి, సమాజానికి ఏదో ఒక మంచి చెయ్యాలి అనే భావంతో పెరుగుతాడు. ఆ లక్షణాలు జితేందర్ రెడ్డితో పాటు పెరిగి, కాలేజీ ఎలక్షన్స్ లో లీడర్ గా ఎదిగి, ఆ తరవాత పోలీసు వ్యవస్థకే దీటుగా, సమాజంలో నక్సలైట్లు చేసే దోర్జన్యాలకు ఎదురు వెళ్తాడు, ట్రైలర్ మద్యలో హిందుత్వం వంటి డైలాగ్ లు మరింత ఆశక్తి పెంచేలా ఉన్నాయి.

1980’s ఒక వ్యక్తి జీవితంలో జరిగే కాలేజీ పాలిటిక్స్, ఆ తరవాత నిజమైన రాజకీయాలు నేపధ్యంలో ఈ కథ సాగుతున్నట్టు ఉంది. మొత్తానికి కంటెంట్ మాత్రం ప్రోమిసింగ్ గా ఉంది, మే 10న ‘జితేందర్ రెడ్డి విడుదల కాబోతుంది అని చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపారు.

IMG 20240503 WA01221

లవ్ స్టోరీస్ డైరెక్ట్ చేసిన విరించి వర్మ ఇలాంటి ఒక ఆక్షన్ సినిమా చేసారా అంటే అస్సలు నమ్మేలా లేదు, విరించి దర్శకత్వంలో మరో కోణం ఈ జితేందర్ రెడ్డితో భయటకి వస్తుందేమో చూడాలి.

నటీ నటులు :

రాకేష్ వర్రే, రియా సుమన్, వైశాలి రాజ్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్..,

IMG 20240503 WA0120

టెక్నికల్ టీం :

డైరెక్టర్ : విరించి వర్మ, నిర్మాత : ముదుగంటి రవీందర్ రెడ్డి, కో – ప్రొడ్యూసర్ : ఉమ రవీందర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాణిశ్రీ పొడుగు, డి ఓ పి : వి. ఎస్. జ్ఞాన శేఖర్, మ్యూజిక్ డైరెక్టర్ : గోపి సుందర్, పి ఆర్ ఓ : మధు VR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *