Jitender Reddy Movie update: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘జితేందర్‌రెడ్డి’ పోస్టర్‌

IMG 20230912 WA0055

 

‘జితేందర్‌ రెడ్డి’ టైటిల్‌…హిజ్‌(హిస్టరీ) స్టోరీ నీడ్స్‌ టు బీ టోల్డ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు ఎవరీ జితేందర్‌ రెడ్డి..అతని హిస్టరీ ఏంటి? చెప్పాల్సింది.. తెలుసుకోవాల్సింది ఏముంది?
ఎక్కడ చూసినా ఇదే చర్చ. దీని వెనకున్న కథేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు విరించి వర్మ.

‘ఉయ్యాల జంపాల’, మజ్ను వంటి రొమాంటిక్‌ లవ్‌స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన కాస్త రూట్‌ మార్చి డిఫరెంట్‌ జానర్‌ కథతో ‘జితేందర్‌ రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు.

IMG 20230912 WA0072

ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు పోస్టర్‌లో చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది చూపించలేదు.. పాత్రధారి పేరు కూడా వెల్లడించలేదు. అయితే పోస్టర్‌ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా టైటిల్‌ను బట్టి, పోస్టర్‌లో ఉన్న నేపథ్యాన్ని నిశితంగా గమనిస్తే…

తెలంగాణలో జరిగిన ఓ వాస్తవ సంఘటన నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టర్‌ చూశాక.. ప్రేమకథలతో ఫేమస్‌ అయిన విరించి వర్మ ఈ తరహా కథ ఎందుకు ఎంచుకున్నారు? ఈ చిత్రంలో ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న క్యూరియాసిటీ జనాల్లో కలిగింది.

IMG 20230912 WA0054

అసలు విషయం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే! గతంలో ఓయూ లీడర్‌ ‘జార్జ్‌ రెడ్డి’ కథ ఆధారంగా వచ్చిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ ‘జితేందర్‌ రెడ్డి’ కథ ఆ తరహాలో ఆకట్టుకుంటుందా? అన్న చర్చ మొదలైంది. పోస్టర్‌లో కనిపిస్తున్న నాయకుడు ఎవరనేది రివీల్‌ చేయలేదు కానీ టెక్నీషియన్లు మాత్రం మంచి పేరున్నవారే కనిపిస్తున్నారు.

వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ కెమెరామెన్‌ పని చేస్తున్నారు. ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతం అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *