‘జితేందర్ రెడ్డి’విడుదల ఎప్పుడంటే ! 

IMG 20241019 WA0240 e1729506413801

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం. అంతే కాకుండా, సినిమా టీజర్, గ్లిమ్ప్స్, రెండు పాటలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం.

IMG 20241021 WA0180

కాలేజీ రోజుల నుంచే ప్రజా సమస్యల కోసం పోరాడుతూ నక్సలైట్ల తో జితేందర్ రెడ్డి చేసిన పోరాటాన్ని ఈ సినిమా లో చూపించారు. అంతే కాకుండా, ఆ తర్వాత అతను రాజకీయాల్లోకి రావడం, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీనియర్ తో మాట్లాడటం ట్రైలర్ లో చూపించారు. ఇప్పటికే భారీ అంచనాలని మూటగట్టుకున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుండటం తో చిత్ర వర్గాలు సినిమా విజయం మీద నమ్మకంగా ఉన్నాయి.

IMG 20241021 WA0178

యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

దర్శకుడు: విరించి వర్మ, నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి, సహ నిర్మాత: ఉమ రవీందర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు, ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్, సంగీత దర్శకులు: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం, పీఆర్: మధు వి ఆర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *