JigarthandaXX Movie team at Tirumarla. తిరుమల శ్రీవారి సన్నిధిలో ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్’ టీమ్..

IMG 20231109 WA0232 e1699553588646

 

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన హై యాక్ష‌న్ డ్రామా మూవీ జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించి ఈ చిత్రాన్ని స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై కార్తీకేయ‌న్ నిర్మించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌కు ఓ రేంజ్‌లో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న గ్రాండ్‌గా ఆడియన్స్‌ ముందుకు తీసుకుస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

IMG 20231109 WA0231

రాఘవ లారెన్స్‌, కార్తీక్ సుబ్బరాజు అండ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహివించారు. ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్’ సూపర్ హిట్ కావాలని స్వామి వారిని కోరుకున్నారు. వేద పండితులు సినిమా విజయవంతం కావాలని మూవీ టీమ్‌కు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తిరుమల ఆలయ ప్రాంగణంలో చిత్రబృందం ఫొటోలు దిగింది. వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య నటనను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్‌గా చంద్రముఖి-2తో లారెన్స్, మార్క్ ఆంటోని మూవీతో ఎస్‌జే సూర్య సూపర్ హిట్స్ అందుకున్నారు. మరో హిట్ వీరి ఖాతాలో చేరుతుందని అందరూ అనుకుంటున్నారు.

 

పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో హై యాక్షన్ స్వీకెన్స్‌తోపాటు ఎమోషనల్‌ కంటెంట్ ఉంటుందని ఇప్పటికే మూవీ మేకర్స్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *