చిత్రం: జ్యూవెల్ థీఫ్,
విడుదల తేదీ : నవంబర్ 08, 2024,
నటీనటులు : కృష్ణ సాయి, మీనాక్షీ జైస్వాల్, ప్రేమ, అజయ్, వినోద్ కుమార్, 30 ఇయర్స్” పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తదితరులు,
డైరెక్టర్ : పి యస్ నారాయణ,
ప్రొడ్యూసర్ : మల్లెల ప్రభాకర్,
సినిమాటోగ్రఫీ : అడుసుమిల్లి విజయ్ కుమార్,
మ్యూజిక్ : యమ్ యమ్ శ్రీలేఖ,
ఎడిటింగ్ : జెపి,
నిర్మాణం : శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా,
మూవీ: రివ్యూ ( Movie Review)
సస్పెన్స్ థ్రిల్లర్‌లంటే మూవీ లవర్స్‌కు ఎంతో ఇష్టం. సరైన కంటెంట్‌తో దిగితే వాటిని ప్రేక్షకులు సూపర్ హిట్ చేస్తారు. అదే కోవాలో వచ్చిన చిత్రం “జ్యూవెల్ థీఫ్ – Beware of Burglar”. తాజాగా ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
పి. ఎస్. నారాయణ దర్శకత్వం వహించగా, మల్లెల ప్రభాకర్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. ఎం. ఎం. శ్రీలేఖ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !

కధ పరిశీలిస్తే (Story Line):
సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. అనాథ ఆశ్రమంలో ఉండే చలాకి అనే అమ్మాయి (మీనాక్షీ జైస్వాల్) కృష్ణసాయి మంచి తనాన్ని చూసి ప్రేమిస్తుంది. సీన్ కట్ చేస్తే.. నేహ (నేహా దేశ్ పాండే) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు.
కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదాం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించి ఫ్రూవ్ చేసుకోవాలని చాలెంజ్ పెడుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ, అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు.
ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు?
ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు?
హత్య కేసు నుంచి బయటపడతాడా?
అనే విషయాలు తెలుసుకోవాలంటే మీ దగ్గరలొని దియేటర్ లో వెంటనే ఈ జ్యూవెల్ థీఫ్ సినిమా చూడాల్సిందే.

కధనం పరిశీలిస్తే (Screen – Play):
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన పి. ఎస్. నారాయణ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే సినిమాను అందించారని చెప్పవచ్చు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం, ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొత్తం మీద అన్ని విభాగాల్లో సరైన నాణ్యత కనిపిస్తోంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన పి. ఎస్. నారాయణ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే సినిమాను అందించారని చెప్పవచ్చు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు
హీరో కృష్ణసాయి తన పాత్రలో మంచి నటన కనబరిచారు. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. ఆయన డాన్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. ఫైటింగ్ సీన్లలో ఇరగదీసాడు.
హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ గ్లామర్ ఆండ్ ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది.
సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్ కథకు తగినట్టుగా తమ యాక్టింగ్ ప్రదర్శన చూపించారు. ఇక “30 ఇయర్స్” పృథ్వి, శివారెడ్డి టైమింగ్‌తో నవ్విస్తుంటారు. శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచేలా ఉంది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ బాగుంది.
సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు.
ఎడిటర్ జేపీ పనితీరు సంతృప్తికరంగా ఉంది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ రూపొందించిన స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
జ్యూవెల్ థీఫ్ మూవీ పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీతోపాటు థియేటర్‌లో చూడదగిన సినిమా.