జీవా నటించిన అగాతియా మూవీ ఫస్ట్ సింగిల్ “గాలి ఊయలలో” రివ్యూ !

jeeva agadhiya movie scaled e1736177766680

ఫాంటసీ-హారర్-థ్రిల్లర్ విజువల్ మాస్టర్ పీస్ అగాతియా ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇది సంగీత, సినీ ప్రేమికులకు మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. మాస్ట్రో యువన్ శంకర్ రాజా స్వరపరిచిన ఈ ట్రాక్ అద్భుతమైన విజువల్స్‌తో పాటు 2025లో బిగ్గెస్ట్ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని వాగ్దానం చేసే మెలోడీలను బ్లెండ్ చేసింది.

గాలి ఊయలల్లో మిస్టరీ, ఎమోషన్స్ ఎసెన్స్ ని అందిస్తోంది. ఇళయరాజా సిగ్నేచర్ పియానో ​​పీస్‌తో ప్రారంభమైన ఈ పాట, మరుపురాని అనుభూతిని అందిస్తూ, ఒక సోల్ ఫుల్ మెలోడీగా అలరిస్తోంది. యువన్ శంకర్ రాజా, మెలోడీలలో మాస్టర్, శ్రోతలను లోతుగా ఆకట్టుకునే పాటని రూపొందించారు. శ్రీధర్ మాస్టర్ కొరియోగ్రఫీ, దీపక్ కుమార్ పాడి అందించిన ఉత్కంఠభరితమైన సినిమాటోగ్రఫీ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా నిలిపాయి.

దర్శకుడు, పాటల రచయిత పా.విజయ్ మాట్లాడుతూ “ఈ పాట కేవలం మెలోడీ కాదు-ఇది ఒక ప్రయాణం. ఇది ఇళయరాజామ బీథోవెన్‌ల ప్రతిభను కలిగి ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఈ ఐడియాను యువన్‌కి అందించగా, అతను కేవలం 10 నిమిషాల్లో మ్యాజిక్ సృష్టించాడు. ఇది టైమ్‌లెస్ ట్యూన్‌లు, మోడ్రన్ సెన్సిబిలిటీల సమ్మేళనం’అన్నారు.

యువన్ శంకర్ రాజా తన అనుభవం గురించి చెబుతూ.. ”పా.విజయ్‌తో కలిసి పనిచేయడం ఎప్పుడూ ప్రత్యేకమే. మేము కలిసి 300 పాటలకు పైగా పని చేసాము. గాలి ఊయలలో మా నాన్నగారి పియానో ​​పీస్ , బీథోవెన్ ట్యూన్‌ను చేర్చడం గురించి అతను చెప్పినప్పుడు, నేను థ్రిల్ అయ్యాను. ఇది నా అత్యుత్తమ మెలోడీలలో ఒకటి అని నేను నిజంగా నమ్ముతున్నాను.’అన్నారు

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ డాక్టర్. ఇషారి కె. గణేష్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు: “అఘటియా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ప్రతి అంశం ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించేలా జాగ్రత్తగా రూపొందించబడింది. గాలి ఊయలలో ఈ ప్రాజెక్ట్ బిగ్ ఎసెట్ యువన్ అసాధారణమైన సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఈ పాట ఈ సినిమా నిర్మాణంలో ఉన్న అంకితభావం, అభిరుచికి నిదర్శనం. ”

భారతదేశంలోని ప్రముఖ కంటెంట్ పంపిణీ, లైసెన్సింగ్ కంపెనీ అయిన అనీష్ అర్జున్ దేవ్ వామిండియా సహకారంతో ప్రముఖ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అయిన వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్ రూపొందించిన గ్రాండ్ ప్రాజెక్ట్ అఘతియా.

ఈ పాన్ ఇండియా మూవీ జనవరి 31, 2025న తమిళం, తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *