సుధీర్ బాబు ‘జటాధర’ చిత్ర నిర్మాణం లో జీ స్టూడియోస్ !

IMG 20250126 WA0223 e1737876068819

సుధీర్ బాబు హీరోగా ‘జటాధర’ చిత్రాన్నిప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది. రుస్తుం తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.

సూపన్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది.

ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘జీ స్టూడియోస్‌లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు.

ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్‌ చాలా భిన్నంగా ఉండబోతోంది. అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు.

ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనేష్ మంఘ్నానితో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ జటాధర ఉండబోతోంది. ఫిబ్రవరిలో జటాధర చిత్రీకరణ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *