JANAM Movie Release Update:  ప్రజల్లో మార్పుని ఆకాంక్షిస్తూ నవంబర్ 10న  విడుదల కాబోతున్న ‘జనం‘ సిన్మా!

IMG 20231102 WA0112

 

రానున్న ఎలక్షన్స్ ముందు దర్శకుడు వెంకటరమణ పసుపులేటి ప్రజలకు ప్రజల్ని ఒకసారి తెరమీద పరిచయం చేసి ప్రజల్లో మార్పుని ఆకాక్షించి, రాసుకుని, తెరకేక్కించిన చిత్రం ‘జనం’. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు యే విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసే ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. కథతో పాటు, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాసుకుని వి.ఆర్.పి క్రియేషన్స్ బ్యానర్ పైన దర్శకుడు వెంకటరమణ పసుపులేటి గారు చిత్రాన్ని నిర్మించారు.

ఈ మధ్య విడుదలైన ట్రైలర్ ప్రస్తుత సమాజాన్ని కళ్ళ ముందు నిలిపి, సినిమాపైన ఆసక్తిని పెంచే విధంగా ఉంది. కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్ లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది.

ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు ఈ తప్పు దారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్ లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపై నడిచే గొప్ప కథ.

IMG 20231102 WA0113

దర్శకుడు ఈ కథకు పూర్తి న్యాయం చేసే నటుల్ని ఎన్నుకోవడంలో సఫలం అయ్యారు. ప్రముఖ నటులు సుమన్, అజయ్ ఘోష్ లాంటి వారితో పాటు కే కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సాంకేతిక నిపుణులు: 

 

శ్రీమతి పి పద్మావతి సమర్పించగా, డాక్టర్ సైమల్లి అరుణ్ కుమార్ సహా నిర్మాతగా వ్యవహారించారు. చిన్న నేపథ్య సంగీతం అందించగా, రాజ్ కుమార్ పాటల్ని సమాకూర్చారు. వెంకటరమణ పసుపులేటి పాటలకు అద్భుతమైన రచన చేయగా, ప్రముఖ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ చూసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *