మే 29న వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి “జ‌నం” మూవీ రీ-రిలీజ్

IMG 20250515 WA0187 e1747316713854

వీఆర్ పీ క్రియేష‌న్స్ ప‌తాకంపై, పి.ప‌ద్మావ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో సుమ‌న్, అజ‌య్ ఘోష్, కిషోర్, వెంక‌టర‌మ‌ణ‌, ప్ర‌గ్య‌ నైనా నటించిన చిత్రం జ‌నం. వెంక‌టర‌మ‌ణ ప‌సుపులేటి స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన “జ‌నం” మూవీ మే 29న రీ-రిలీజ్ కాబోతుంది. రాజకీయాలను, రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఘాటైన చర్చను రాజేసిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 10న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది.

సమాజంలోని పౌరులను పక్కదారి పట్టిస్తున్న ఘటన లను ఎత్తి చూపిస్తూ, అందరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తీసిన ఈ సినిమా.. ప్రేక్షకులందరికి చేరాలనే మళ్లీ విడుదల చేస్తున్నారు.

IMG 20250515 WA0185

 ఈ సందర్భంగా రచన,దర్శక నిర్మాత వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ.. “అదుపు త‌ప్పుతున్న నేటి త‌రానికి అవ‌గాహ‌న కోసం చ‌క్క‌టి సినిమా అందిస్తున్నాం. ఉత్త‌మ పౌరులుగా ఉండాల్సిన వారు స్మార్ట్‌ఫోన్‌కు, నాయకుల పంచే మందు, డ‌బ్బుల‌కు ఎలా బానిస అవుతున్నారో ఆలోచింప‌చేసేలా సినిమా తెర‌కెక్కించాము. ఒకప్పుడు సినిమాలు జనాన్ని ఆలోచింప చేసే విధంగా ఉండేవి.

కంటి చూపుతో విమానం కూలటం, రక్త పాతం, హింస, బీపీలు పెరిగే సౌండ్ అర్ధం లేని సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్. సమాజానికి,రేపటి తరానికిఎలాంటి నేప‌థ్యమో ఆలోచించండి.మీ కోసం…. ఈ నెలలో విడుదల అవుతున్నజనం సినిమా చూడండి.. ఓటీటీకి ప్లాన్ చేయ‌డం లేదు.

IMG 20250515 WA0186

 ఈ సినిమాకు సుమ‌న్ గారే హీరో. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టించారు. ఇందులో క‌మ‌ర్షియ‌ల్ అంశాలు, సందేశం, సెంటిమెంట్ , థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి.

మే 29న థియేటర్ లకు వెళ్లి ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *