జైపూర్ పుట్ యూఎస్ క్యాంప్ హైటెక్ సిటీలోని పీపుల్స్ టెక్ ప్రాంగణంలో ప్రారంభించిన కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల

peoples tech jaipur lumb camp 4 e1673458786275

హాజరైన స్టార్ యాంకర్ సుమ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మందికిపైగా ఉచితంగా జైపూర్ ఫుట్స్ ను అందిస్తామని వెల్లడి

హైదరాబాద్ః అనుకోని ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన వారికి చేయూతనిచ్చేందుకు జైపూర్ ఫుట్ యూఎస్ సంస్థ ముందుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు వెయ్యి మందికిపైగా వికలాంగులకు ఉచితంగా జైపూర్ ఫూట్, లింబ్స్ అందించేందుకు సిద్ధమైంది.

peoples tech jaipur lumb camp

ఈ మేరకు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో పీపుల్ టెక్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్, జైపూర్ ఫూట్ యూఎస్ఏ, భగవత్ మహవీర్ వికలాంగ సహాయ సమితి, జైపూర్ ఇండియా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్స్ టెక్, ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థలు చేపట్టిన జైపూర్ ఫుట్ క్యాంపును కేంద్ర సామాజిక శాఖ మంత్రి రాందాస్ అత్వాల లాంఛనంగా ప్రారంభించారు.

జైపూర్ యూఎస్ వ్యవస్థాపకులు ప్రేమ్ బండారీతోపాటు ప్రముఖ వ్యాఖ్యాత,ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్ సంస్థ వ్యవస్థాపకురాలు సుమ కనకాల, అవినాష్ రాయ్, ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ అతిథులుగా హాజరై దివ్యాంగులకు తమ సంస్థల ద్వారా అందే సహకారాన్ని వివరించారు.

peoples tech jaipur lumb camp 3

ఈ కార్యక్రమంలో ప్రేమ్ బండారీ చేయి కోల్పోయిన ఓ చిన్నారికి ఆర్టిఫిషియల్ లింబు కోసం వచ్చేందుకు రవాణా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేశారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 150మందికిపైగా వికలాంగుల వివరాలను నమోదు చేసుకొని వారందరికి ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుట్స్ ను అందించనున్నారు.

peoples tech jaipur lumb camp 3

ఈ సందర్భంగా పీపుల్ టెక్స్ సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడుతూ…
రాందాస్ అత్వాలగారికి నా కృతజ్ఞతలు. అలాగే జైపూర్ యూఎస్ఏ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ప్రతినిధులకు కూడా నా ధన్యవాదాలు. మీరందరు ఒక మంచి పని కోసం తెలుగు రాష్ట్రాలను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్, తిరుపతి నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెడతాం.

వ్యాఖ్యాత సుమ మాట్లాడుతూ… త్వరలోనే తెలంగాణే కాదు దేశం కూడా డిసెబులిటీ, స్పెషల్ ఏబుల్డ్ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారుతుంది. దివ్యాంగులైనా ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించే హక్కు ఉంది. అంకుర్, అలోక్, ఎఫ్ఐఏలు చేస్తున్న కృషి చాలా గొప్పది.

peoples tech jaipur lumb camp 2

చాలా మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ దొరకడం కష్టం. డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అలాంటిది ఉచితంగా వాళ్లకు ఆర్టిఫిషియల్ జైపూర్ పుట్స్ ఇస్తున్నందుకు అందరి తరపున ఎఫ్ ఐఏకు నా కృతజ్ఞతలు.

కేంద్ర మంత్రి రాందాస్ అత్వాల మాట్లాడుతూ…
దేశంలో సుమారు 2 కోట్ల 60 లక్షల మంది మంది దివ్యాంగులున్నారు. వారందరికి మా ప్రభుత్వం తరపున సహాయం చేసేందుకు కృషి చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *