JAILAR Movie Telugu Review: రజినీ ఫ్యాన్స్ కి నచ్చే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా!

IMG 20230810 WA0079

మూవీ: జైలర్ (JAILAR):

IMG 20230810 WA0095

విడుదల తేదీ : ఆగస్టు 10, 2023

నటీనటులు: రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు మరియు తదితరులు

దర్శకుడు : నెల్సన్ దిలీప్ కుమార్

నిర్మాతలు: కాలనీతి మారన్

సంగీతం: అనిరుద్ రవిచంద్రన్

సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్

ఎడిటర్: ఆర్.నిర్మల్

జైలర్ మూవీ రివ్యూ:

IMG 20230810 WA0094

తలైవా సూపర్ స్టార్స్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ “జైలర్”. కాగా ఈ చిత్రం రోజు తమిళ్ తో పాటు తెలుగు లో కుడా ఈ రొజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీమ్ సమీక్ష చదివి తెలుసుకుందాం !

 

IMG 20230810 WA0040

కథ ని పరిశీలిస్తే (Story line):

వేల్ ముత్తు  పాండియన్ (రజినీకాంత్ ) గతంలో స్ట్రిక్ట్ జైలర్ అయినప్పటికీ.. ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. తన మనవడితో ముత్తు సరదా సరదాగా ఉంటాడు. ముత్తు కొడుకు  పోలీస్ అధికారి ఏసిపి ఒక కేష్ విసయం లో అపహరణకు గురియావుతాడు. ఈ కిడ్నాప్ నీ పోలీస్ శాఖ చేదించకుండా ఆత్మ హత్య గా చిత్రీకరించి కేస్ క్లోజ్ చేస్తారు.

IMG 20230810 WA0100

ముత్తు కొడుకిది హత్యా అని తెలుసుకొని చావుకి ప్రతీకారంగా  హత్యలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముత్తు ఫ్యామిలీకి ఆపద వస్తోంది.

ముత్తు తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి  ఏం చేశాడు ?,

తన కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తున్న వారి పై ఎలా ఎటాక్ చేశాడు ?,

తన కొడుకు అపహరణకు కారణం ఏంటి?

చివరకు ముత్తు తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ?,

ఇంతకీ ముత్తు కొడుకు నిజ స్వరూపం ఏమిటి ?

ముత్తు కి సహాయం చేస్తున్నది ఎవరూ?

అనే ప్రశ్నలు ఇంటరెస్టింగ్ గా ఉంటే జైలర్ సినిమా దియేటర్ కి వేళ్లి వెంటనే చుసేయండి.

కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):

20230810 070551 e1691660311173

జైలర్ పాత్రను, ఆ పాత్ర తాలూకు ప్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోలేదు. ముఖ్యంగా ఆసక్తికరంగా రిటైర్డ్ జైలర్ పాత్ర నీ ఆకట్టు కొనే విధంగా రాసుకోలేదు అనే చెప్పాలి.

ఈ జైలర్ సినిమా లో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నెల్సన్ తన గత  సినిమాల శైలిలోనే  ఈ సినిమాని కూడా నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు.

మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) ను వేగంగా నడిపిన ఆయన రెండవ అంకం (సెకెండాఫ్) ని మాత్రం మరీ సాగతీశారు అనిపిస్తుంది.

ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో నెల్సన్ విఫలమయ్యారు. స్క్రీన్ ప్లేను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం తన శైలిలోనే సినిమాని ముగించారు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన రజినీ కొడుకు పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది.

ఓవరాల్ గా ఈ జైలర్ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, ఆ ఎమోషన్ లో కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా.. అవి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు. రజినీకాంత్ ఫాన్స్ కూడా సెకండ్ హాఫ్ విషయంలో అసంతృప్తికి గురి అవుతారు. 

నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:

IMG 20230810 WA0086

జైలర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం సైలెంట్ హ్యూమర్ర్ తో  పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. రజినీ నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు.

IMG 20230810 WA0096

అతిధి పాత్రల్లో నటించిన మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు.

మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు.

తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. తమన్నా స్పెషల్ సాంగ్ బాగుంది. వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబులతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ప్రతి ఒక్కరు తమ పాత్రలో ఒదిగిపోయారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి.

సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

IMG 20230810 WA0091

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడిగా ఈ సినిమాకి న్యాయం చేసినా.. రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యారు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన కథనం (స్క్రీన్ – ప్లే ) మిద ఇంకా బాగా వర్క్ చేసి ఉండాల్సింది.

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది.

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ప్ర‌తి స‌న్నివేశాన్ని కెమెరామెన్ బాగా విజువ‌లైజ్ చేశారు.

 ఆర్.నిర్మల్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.

సినిమా నిర్మాత కళానిధి మారన్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

IMG 20230810 WA0104

18F మూవీస్ టీం ఒపీనియన్:

రజనీ కదనాయకుడు గా జైలర్ అంటూ భారీ తారాగణంతో వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ నటన, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్ మరియు యాక్షన్ సీన్స్ లో ఉండే హ్యూమర్ బాగానే వుంది, ఇంకా ఈ కధ లో  బలమైన తండ్రీ – కొడుకుల ఎమోషన్, మంచి కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ, సిన్మా తెర మీద ఆ ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ లో ప్రేక్షకుడు ఇన్ వాల్వ్ అయ్యేంతగా   ఎస్టాబ్లిష్మెంట్ కాలేదు.

అలాగే సీరియస్ సీన్స్ లో కూడా కామిడీ చొప్పించడం వలన ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు. ఇంకా  బోరింగ్ ట్రీట్మెంట్ కారణంగా సినిమా ఫలితం దెబ్బతింది. ఓవరాల్ గా సూపర్ స్టార్ అభిమానులను మాత్రమే ఈ జైలర్ నచ్చుతాడు సామాన్య సినీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు.

IMG 20230808 WA0077

టాగ్ లైన్: ఎస్కేప్ ఫ్రమ్ జైల్!

18F Movies రేటింగ్: 2.75 / 5 

* కృష్ణ ప్రగడ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *