సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’ చిత్రానికి ఆర్ఆర్ అందిస్తున్న సామ్ సిఎస్‌!

IMG 20250312 WA0173 e1741785643224

 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్ – కొంచెం క్రాక్’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

సిద్ధు, భాస్కర్‌ల క్రేజీ కాంబోకి తగ్గట్టుగానే జాక్ సినిమా ఉండబోతోందని టీజర్, పాటలు చూస్తేనే అర్థం అవుతోంది. ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు.

ప్రస్తుతం జాక్ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. సౌత్‌లో సామ్ సీఎస్‌కి సంగీత దర్శకుడిగా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అలాంటి క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సీఎస్ ఈ జాక్ చిత్రానికి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గా పుష్ప 2, సుడల్ 2లో శామ్ సీఎస్ అందించిన ఆర్ఆర్ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే.

IMG 20250312 WA0171

బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దూసుకుపోతోన్న శామ్ సీఎస్ ఇక జాక్ సినిమాలో సిద్దుని ఏ రేంజ్‌లో ఎలివేట్ చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి పాటలు అందిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సినిమా మీద అంచనాల్ని పెంచేశాయి. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యేందుకు దాదాపుగా 30 రోజులున్నాయి. ప్రస్తుతం మేకర్లు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి కానుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *