‘టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల పేరు వినగానే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లు గుర్తొస్తాయి. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్లతో పాటు ‘రాబిన్ హుడ్’తో కూడా ప్రేక్షకులను అలరించిన వెంకీ… ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు.
తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై మొదటి చిత్రంగా ‘ఇట్లు అర్జున’ను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా రొటీన్ సినిమాలాగా కాకుండా ఎన్నో బిగ్ సర్ప్రైజ్‌లతో వస్తోంది.
ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త.. ఏఎంఆర్ ఇండియా చైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు, అనీశ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది అనీశ్‌కు తొలి సినిమానే అయినా అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశాడు.
అందుకే వెంకీ కుడుముల ఈ కొత్త టాలెంట్ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఈ యంగ్ & టాలెంటెడ్ హీరోని పరిచయం చేస్తూ గ్రాండ్ లాంచ్ ఇస్తున్నారు. హీరోయిన్‌గా మలయాళ స్టార్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో అపారమైన క్రేజ్ ఉంది. ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వబోతుంది.
అయితే తాజాగా ‘ఇట్లు అర్జున’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్… ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్, డ్రామా ఎలిమెంట్స్‌ను టీజ్ చేస్తోంది. అర్జున పాత్రలో అనీశ్ సైలెంట్ బట్ స్ట్రాంగ్ హీరోగా కనిపిస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే భారీ ప్రయోగం చేస్తున్నాడు.
ఈ సినిమాలో మూగవాడిగా వికలాంగుడి పాత్రలో నటించబోతున్నాడు. మాటలు లేకుండానే భావాలు వ్యక్తం చేసే సైలెంట్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా ఆకట్టుకుంటోంది.
నాగార్జున డైలాగ్స్ గ్లింప్స్‌కు ఎక్స్‌ట్రా గ్రావిటీని జోడించాయి.ఈ సినిమా టెక్నికల్ టీమ్ కూడా టాప్ టీం అనే చెప్పాలి. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రాజా మహదేవన్, ఎడిటింగ్ కోటి కె. వంటి నిపుణులు అందిస్తున్నారు.
గ్లింప్స్ లో సంగీతం, విజువల్స్ హాలీవుడ్ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ చిత్రం… కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, రిఫ్రెషింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. గ్లింప్స్ చూసిన నెటిజన్లు ఇప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
గతంలో మహేశ్ రెడ్డి.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరవు డైరెక్షన్లో కింగ్ నాగార్జున హీరోగా ‘శిరిడీ సాయి’, ‘ఓం నమో వెంకటేశ్వరాయ’ వంటి భక్తి చిత్రాలను నిర్మించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇప్పుడు తన కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తూ కొత్త అడుగు వేస్తున్నారు.
ప్రేక్షకులకు రొటీన్ గా కాకుండా కొత్తగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. తాజా గ్లింప్స్ చూశాక కచ్చితంగా ‘ఇట్లు అర్జున’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు పెరిగిపోయాయి. మరి అనీశ్ కొత్త జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.