ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీ “కిల్లర్” త్వరలో మిమ్మలను కలుస్తుంది.! 

IMG 20251025 WA0295 e1761482630986

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం.

జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా…విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

IMG 20251025 WA0296

ఈ రోజు “కిల్లర్” మూవీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇండియా ఫస్ట్ సూపర్ షీ మూవీగా “కిల్లర్” ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే “కిల్లర్” సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు :

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్, తదితరులు..,

టెక్నికల్ టీమ్: 

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – ఆశీర్వాద్ , సుమన్ జీవ, వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), లైన్ ప్రొడ్యూసర్ – దశరథ, బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ, సమర్పణ -ఉర్వీష్ పూర్వజ్, నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి, రచన దర్శకత్వం – పూర్వాజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *