పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో పాటు ఆ చిత్రంలో ఐకాన్‌స్టార్ నట విశ్వరూపంకు ఫిదా అవ్వని వారు లేరు. ఈ చిత్రంతో ఆయనకు లభించిన పాపులారిటీతో ప్రపంచంలో ఏ మూలాన వెళ్లిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తారసపడతారు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఐకాన్‌స్టార్ ఎక్కడికి వెళ్లిన ఆయనకు అభిమానుల చేత గ్రాండ్ వెలకమ్ లభిస్తుంది.
తాజాగా ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ షూటింగ్ ఏకధాటిగా జరుగుతుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ అసోసియేట్‌తో మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు.
కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి వైజాగ్‌లో ప్రారంభమైంది. అత్యంత కీలకంగా భావించే ఈ షెడ్యూల్లో కోసం వైజాగ్ వెళ్లిన ఐకాన్‌స్టార్‌కు అల్లుఅర్జున్‌కు అక్కడి అభిమానులు, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్ పోర్టు నుంచి అభిమానులు బైక్ ర్యాలిగా బయలుదేరి తమ అభిమాన హీరో కనివినీ ఎరుగని వెల్కమ్ చెప్పారు. దారి పొడవున పూలవర్షం కురిపించారు.
అల్లు అర్జున్ ఆర్మీ తో పాటు సినిమా అభిమానుల ఆప్యాయతను చూసి ఐకాన్‌స్టార్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎలెక్షన్ కాంపైన్స్ కి జనాలు స్వచ్ఛందంగా రాకపోవడం తో పొలిటికల్ పార్టీ లు వారికి డబ్బులు , బిర్యానీ మందు బాటల్స్ ఇచ్చి ర్యాలీ లకు తెచ్చుకొనే పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి సిట్యువేసన్స్ లో కూడా అభిమానులు స్వచ్చంధనగా వచ్చారు అంటే ఆ క్రెడిట్ అంతా పుష్ప రాజ్ ఇమేజ్ అని అక్కడి పొలిటికల్ లీడర్స్ అనుకొంటున్నారు. చూడాలి ఈ ఫాలోయింగ్ ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆయన పార్టీ పెద్దలు కానీ ఎలా ఉపయోగించుకొంటారో.
అన్నట్టు, జనసేన పార్టీ పొలిటికల్ కాంపైన ముఖ్య పారా పోసిస్తున్న బన్నీ వాసు ఐకాన్ స్టార్ ని రియల్ పొలిటికల్ కాంపైన కి పిలుస్తారా ! లేదా చూడాలి.