ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇండియాలోని ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్‌స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య డాన్స్ ఆఫ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘వార్ 2’లో మనం చూడబోతున్నాం. ఈ విజువల్ ఫీస్ట్‌ను సిల్వర్ స్క్రీన్‌పై మాత్రమే చూసి ఎంజాయ్ చేసేలా రూపొందించారు.
భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎనర్జిటిక్‌గా, విజువల్ ఫీస్ట్‌లా ఉండబోయే ఈ పాట డాన్స్ సీక్వెన్సుల్లో అద్భుతంగా మారనుంది. ఈ పాటలో ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు సినీ పవర్ హౌసెస్ లాంటి స్టార్స్ కనిపించబోతున్నారు. తెలుగులో ‘సలాం అనాలి..’, హిందీలో ‘జనాబెఅలీ..’ అంటూ సాగే ఈ పాట నుంచి రేపు ఉదయం గ్లింప్స్‌ను విడుదల చేస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్
అయితే, ఈ పాటను పూర్తిగా చూసి ఎంజాయ్ చేయాలంటే మాత్రం తప్పకుండా థియేటర్‌లో చూడాల్సిందే. ఈ పాటను పెద్ద తెరపై చూడడానికే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను వార్ 2 సినిమాతో ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో థియేటర్లలో విడుదలయ్యే సందర్భంలో అందించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది.
‘డాన్స్ ఫ్లోర్‌పై కూడా వార్ ఉంటుంది’ .. భారీ తెరపై మాత్రమే చూడగలిగే డ్యాన్స్ యుద్ధానికి సంబంధించి చిన్న గ్లింప్స్‌ను రేపు చూడండి. ‘వార్ 2’ ఈ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవుతోంది!
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, ఆదిత్య చోప్రా నిర్మాణంలో రూపొందుతున్న వార్ 2.. ప్రేక్షకులు ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. యాక్షన్, విజువల్ అద్భుతాలతో పాటు ఇప్పుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య అద్భుతమైన డ్యాన్స్ షోడౌన్‌ను కూడా ఈ సినిమాలో మనం చూడొచ్చు.
ప్రపంచ వ్యాప్తంగా ‘వార్ 2’ సినిమా ఆగస్ట్ 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.