Hrithik Shaurya’s  Ashwadhama Movie First Look Released: హృతిక్‌ శౌర్య బర్త్‌డే సందర్భంగా అశ్వధామ ఫస్ట్‌ లుక్‌ విడుదల !

ashwaddama hero first look e1699360028479

హృతిక్‌ శౌర్య, వరలక్ష్మీ శరతకుమార్‌ కీలక పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అశ్వధామ’. ‘హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. చంద్ర శేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్  స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసింది.

ashwaddama hero 3

హృతిక్‌ శౌర్య ‘ఓటు’ చిత్రంతో హీరోగా కెరీర్‌ ప్రారంభించారు. అందులో సాఫ్ట్‌ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్‌ కమర్షియల్‌ హీరోగా కనిపించనున్నారు.

ashwaddama hero

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇది. పక్కా కమర్షియల్‌ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్‌ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్‌ షేడున్న పాత్రలో ఒక సర్‌ప్రైజ్‌ ఆర్టిస్ట్‌ కనిపిస్తారు.

ashwaddama hero 2

హీరో హృతిక్‌ శౌర్య  కి ఈ అశ్వధామ’ మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్‌ హీరోగా ఎలివేట్‌ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్‌ అంతా ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్  చిత్రీకరించాం’’ అని అన్నారు.

ashwaddama hero 1

నటీనటులు:
హృతిక్‌ శౌర్య, వరలక్ష్మీ శరతకుమార్‌, చిత్రం శ్రీను,టెంపర్‌ వంశీ,మానిక్‌ రెడ్డి,సత్యకృష్ణ,షేకింగ్‌ శేషు,యోగి కత్రి,పటాస్‌ ప్రవీణ్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌: చిన్నా, సంగీతం: ప్రజ్వల్‌ కుమార్‌, సాహిత్యం: తేజ, స్టంట్స్‌: పృధ్వీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రామకృష్ణ ఉప్పలపాటి, కొరియోగ్రఫీ: ఈశ్వర్‌ పెంటి, పబ్లిసిటీ డిజైనర్‌ : ఓంకార్‌ కడియం, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి డేరంగుల, ప్రొడక్షన మేనేజర్‌: ఆర్‌వి రామకృష్ణ, పిఆర్‌ఓ: వి.ఆర్‌ మధు, నిర్మాణం: ఫ్లిక్‌నైన ఫిల్మ్స్‌, కథ – మాటలు  – దర్శకత్వం : చంద్రశేఖర్‌ ఆజాద్‌ పాటిబండ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *