Hollywood Stunt Choreographer amazed by Samantha’s dedication: యశోద’లో సమంత యాక్షన్ రియలిస్టిక్ గా ఉంటుంది అంటున్న యాక్షన్ డైరెక్టర్ ఎవరో తెలుసా ?

BEHIND ACTION TRILLER OF SAM

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

yasoda trailer out

ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్  సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. ఈ రోజు యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఆ వీడియోలో యానిక్ బెన్ మాట్లాడారు.

SAMANTHA WITH FIGHT MASTER

‘యశోద’ యాక్షన్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన యానిక్ బెన్ మాట్లాడుతూ ”నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్‌గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం.

SAMANTHA WITH STUNTS MASTER FOR YASODA

అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. యాక్షన్ డైరెక్టర్స్ కోరుకునేది అదే కదా! అందుకని, ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది.

యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. ‘యశోద’లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో… ‘యశోదలో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో , మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్… ‘యశోద’ యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి” అని అన్నారు.

sam in yasoda

ద ఫ్యామిలీ మ్యాన్ 2′ వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో ‘యశోద’ ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ‘ఇన్సెప్షన్’, ‘డంకర్క్’కు కూడా ఆయన వర్క్ చేశారు.

SAM IN YASODA 1

‘ట్రాన్స్ పోర్టర్ 3’, ‘ప్రాజెక్ట్ 7’, ‘ప్యారిస్ బై నైట్ ఆఫ్ లివింగ్ డెడ్’,  ‘సిటీ హంటర్’ చిత్రాలతో పాటు హిందీలో షారుఖ్ ఖాన్ ‘రయీస్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్ జిందా హై’, తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’, మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ చిత్రాలకు కూడా యానిక్ బెన్ పని చేశారు.

yasoda వరలక్ష్మి

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్……

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *