కైకాల సత్యనారాయణ గారి మరణం పట్ల సంతాపం తెలిపిన ఆయన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ చిత్ర యూనిట్

kaikela satyanarayana latest film e1671804822959

 

– ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ చిత్రం కైకాల సత్యనారాయణ గారికి అంకితం

నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మరణం పట్ల ఆయన చివరిగా నటించిన ‘దీర్ఘాయుష్మాన్‌భవ’ చిత్ర యూనిట్ సంతాపం తెలిపింది. దాదాపు 60ఏళ్ల పాటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన కైకాల సత్యనారాయణ గారు నటించిన చివరి చిత్రం’దీర్ఘాయుష్మాన్‌భవ’.

satya son and kcr

టారస్ సినీకార్ప్ & త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రంలో తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన యముడి పాత్ర పోషించారు కైకాల సత్యనారాయణ.

satya kcr 2

”కైకాల సత్యనారాయణ గారు నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులని అలరించిన గొప్ప నటుడు. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు కైకాల సత్యనారాయణ గారు. మేము నిర్మిస్తున్న ఆయన చివరి చిత్రం ‘దీర్ఘాయుష్మాన్‌భవ’లో కైకాల సత్యనారాయణ గారు యుముడి పాత్రని పోషించారు.

ఈ రోజు కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోవడం బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.

satya kcr

‘దీర్ఘాయుష్మాన్‌భవ’ విడుదలకు రెడీ అయ్యింది. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసి జనవరిలో చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటుండగా ఆయన మరణవార్త మమ్మల్ని కలచివేసింది. కైకాల సత్యనారాయణ గారికి ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాం” అని నిర్మాతలు తెలిపారు

తారాగణం: కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి, కైకాల సత్యనారాయణ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకత్వం : పూర్ణానంద్
కెమెరా : మల్హర్ భట్ జోషి
సంగీతం : వినోద్ యాజమాన్య
సమర్పణ : శ్రీమతి ప్రతిమ
నిర్మాతలు: బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ
బ్యానర్లు: టారస్ సినీకార్ప్ & త్రిపుర క్రియేషన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *