మూవీ: Hi నాన్న(Hi Nanna):
విడుదల తేదీ: 7 Th డిసెంబర్ 2023,
నటీనటులు: నాని, మృణాల్ ఠాకూర్, చిన్నారి కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరాం, నాజర్, అంగద్ బేడీ , విరాజ్ అశ్విన్ తదితరులు…
దర్శకుడు : శౌర్యువ్
నిర్మాతలు: మోహన్ చేరుకూరి, విజేందర్ రెడ్డి
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్
సినిమాటోగ్రఫీ: సాను వార్గేష్ ,
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
Hi నాన్న రివ్యూ (Hi Nanna Review):
నేచురల్ స్టార్ అని అందరూ నాని ఎందుకు పిలుస్తున్నారో అనుకొనే కొంతమందికి ఈ Hi నాన్న సినిమా చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. `దసరా` వంటి ఊరమాస్ మూవీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేద్దాము అని డిసైడ్ అయ్యి నాని తాజాగా `హాయ్ నాన్న` అనే చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా శృతి హాసన్ గెస్ట్ రోల్ నటించిన ఈ సినిమా ను నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించారు.
తండ్రి – కూతుళ్ల, భార్య – భర్తల రిలేసన్స్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ కావడంతో పాటు, నాని 50 రోజుల ముందు నుండే సిన్మా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొలపారు. పైగా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకున్నాయి.
తెలుగు ఇండస్ట్రి లో నూతనంగా ప్రారంబమైన వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను రిచ్ గా నిర్మించడం తో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ మూవీ నేడు(డిసెంబర్ 7న) విడుదలయ్యింది. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం తో విడుదల కు ఓక రోజు ముందుగానే మీడియా కు, కొంత మంది క్రూ -ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రత్యేకంగా ప్రీమియర్ ప్రదర్శించారు. మరి ఈ Hi Nanna సినిమా ప్రేక్షకులు, మీడియా అంచనాలను అందుకుందా? లేదా అనేది మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
విరాజ్(నాని) ముంబైలో ఓ స్టూడియో రన్ చేస్తున్నసెలబ్రిటీ ఫోటోగ్రాఫర్. తనకు 6 ఏళ్ల కూతురు మహి (బేబీ కియారా ఖన్నా)తో కలిసి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. స్కూల్ లో చదువుతున్న తన కూతురికి అరుదైన అనారోగ్య సమస్య (లంగ్ డిసీజ్) తో భాద పడుతూ ఉంటుంది. మహీ ఎక్కువ రోజులు బతకదు అని డాక్టర్స్ చెప్పినా.. మహి తనను వదిలి వెళ్ళదు అని బలంగా నమ్ముతుంటాడు విరాజ్. ఓ వైపు వృత్తిరిత్య బిజీగా ఉన్నా తనకోసం టైమ్ కేటాయిస్తూ తనని ఎంతో కేరింగ్‌గా చూసుకుంటాడు.
రాత్రులు పడుకో బెట్టడానికి రోజు ఓ కధ చెబుతూ ఎంటర్టైన్ చేస్తుంటాడు. తనకు ఏ కథ చెప్పినా అందులో పాత్రలను ఊహించుకోవడం మాయకి అలవాటు. తనకు ఎప్పుడూ డాడీ స్టోరీస్ చెబుతున్నాడని, మమ్మీ స్టోరీస్ చెప్పాలని మారం చేస్తుంది మాయ. స్టడీస్‌లో ఫస్ట్ వస్తే చెబుతా అంటాడు విరాజ్. డాడీ చెప్పినట్టే మహీ స్టడీస్‌లో ఫస్ట్ వచ్చినా, మమ్మి స్టోరీ చెప్పకపోవడంతో మహీ ఆలిగి తన ఫ్లూటో(పెట్ డాగ్)తో కలిసి ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
ఇంటినుండి బయటికి వెళ్ళిన మహీ ఆపదలో ఉన్న టైమ్ లో యష్ణ(మృణాల్ ఠాకూర్) కాపాడి మహీ కి దగ్గర అవుతుంది. సిటీ అంతా వెదుకుతున్న నాన్న కి మహీ ఆచూకీ తెలిసి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వస్తే, యష్ణని నాన్నకి పరిచయం చేసి అమ్మ కధ చెప్తే నే వస్తాను అని మొండికేస్తుంది.
అక్కడ ఉన్న మూడో వ్యక్తి యష్ణ మీద కొప్పడుతూనే విరాజ్ మమ్మీ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. డాడీ కధ చెప్పేటప్పుడు పాత్రలలో ఎవరినో ఒకరిని ఊహించుకోవడం అలవాటు ఉన్న మహీ తన అమ్మ కథలో మమ్మీగా యష్ణని ఊహించుకుంటుంది. ఇలా సాగిపోతున్న సినిమా కధలో జరుగుతున్న కొన్ని పరిణామాల తో కధ కొత్త కొత్త మలుపులు తీసుకొంటుంది.
అసలు విరాజ్ భార్య ఎవరు ?
విరాజ్ భార్య, విరాజ్ ని బిడ్డను వదిలేసి ఎక్కడికి వెళ్లి పోయింది?
మహి తల్లి లేని లోటు ని ఎలా ఆదికమించింది ?
మహీ చనిపోతుంది అని తెలిసి విరాజ్ ఎలాంటి చాలెంజ్‌ను స్వీకరించాడు?
విరాజ్, మహి జీవితంలోకి వచ్చిన యష్ణ ఎవరు?, యష్ణ గతం ఏమిటి ?
కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోనున్న యష్ణ.. విరాజ్ మహీ కి ఎలా దగ్గరైంది?
యష్ణ మహి కోసం డాక్టర్ అరవింద్‌తో పెళ్లిని ఎందుకు వద్దు అనుకోంది?
అరుదైన వ్యాధిని మహి జయించిందా? మహికి తల్లి కావాలనుకొన్న యష్ణ కోరిక నెరవేరిందా?
అనే ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే Hi నాన్న సినిమా దియేటర్ కి వెళ్ళి వెంటనే చూడవలసిందే !

కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు శౌర్యవ్ తీసుకున్న కథాకు తను వ్రాసుకొన్న కథనం (స్క్రీన్ – ప్లే) విశయం లో మరికొంత జాగ్రత్త తీసుకొని చేయవలసిందా అనిపిస్తుంది. ప్రస్తుతం దియేటర్స్ కి వచ్చే చూసే సినీ ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. స్పీడ్, థ్రిల్లింగ్, యాక్షన్ ఉన్న సినిమాలు ఇష్ట పడుతున్నారు. అందుకే నాని నటించిన దసరా మూవీ కూడా 100 కోట్ల వసూళ్లు సాదించింది. ఈ Hi నాన్న కధ అందులోని పాత్రల మధ్య రిలేసన్స్, ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని కదిలించేలా ఉన్నా కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది.
ముఖ్యంగా మొదటి అంకం ( ఫస్ట్ హాఫ్) లోని కూన్నూర్ ఎపిసోడ్, అలాగే రెండవ అంకం (సెకండాఫ్) లో వచ్చే స్టార్టింగ్ ఎపిసోడ్ అంతగా ఆసక్తికరంగా సాగలేదు అనిపిస్తుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉన్నాయి కానీ ఎమోషన్ క్యారి అవటం వలన చూసేవాళ్ళకి సినిమా కధనం స్లో గా ఎక్కుతుంది. డెబ్యూ దర్శకుడు తాను అనుకున్న పాయింట్ ని తెర మీద బాగానే చువపించినా సినిమాలో కొన్ని రొటీన్ అండ్ స్లో సీన్స్ వలన దియేటర్ లో ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి.
ఇంటర్వెల్ లో ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చి… రెండవ అంకం (సెకండాఫ్) పై కొంత ఇంట్రెస్ట్ పెంచే ప్రయత్నం చేసినా.. అది అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. ప్రతీ సీన్ ను ఎమోషన్ రాబట్టడం కోసం పొడగించడం వల్ల కొన్ని సీన్స్ ప్రస్తుత యువతకు బోర్ అనిపించవచ్చు. చివరాకరకు వచ్చే ఆకరి గట్టం (క్లైమాక్స్) కూడా అందరూ ఊహించే విధంగానే ముగిస్తుంది.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు శౌర్యువ్ డెబ్యూటెంట్ డైరెక్టర్ గా కాకుండా సినీయర్ రైటర్ లాగా ఈ Hi నాన్న కధ ను వ్రాసుకొని అలానే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాని తెరకెక్కించడం విశేషం. కథ పరంగా, కధనం (స్క్రీన్ ప్లే) పరంగా హ్యూమన్ రిలేసన్స్, ఎమోషన్స్ మధ్యలో మంచి నటులతో అద్భుతంగా మలచే ప్రయత్నం చేశాడు.
న్యాచురల్ స్టార్ నాని విరాజ్‌గా అద్బుతమైన పాత్రలో నటించి మెప్పించాడు. పాప కు తండ్రిగా, ప్రియరాలు కి ప్రియుడిగా, భార్య కు భర్తగా, ఇష్ట పడి నేర్చుకొన్న ప్రొఫెషన్ లో ప్రొఫెషనల్‌గా పలు రకాల వేరియేషన్స్‌లో నటించాడా లేక విరాజ్ పాత్ర లో జీవించాడా అనిపిస్తుంది. బరువైన, ఎమోషనల్ సీన్లలో నాని చూపించిన హావభావాలు చూసే ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తాయి. ఏదోక సీన్ లో కళ్ళు చెమ్మ గిల్లడం గ్యారంటీ.

మృణాల్ ఠాకూర్ నటించిన టిపికల్ పాత్ర ఐనా ఆమె నటించిన తీరు బ్రహ్మాండంగా ఉంటుంది. సీతా రామం లో సీత తర్వాత Hi నాన్న లొని యశ్న-వర్ష గుర్తుండిపోతుంది. అందం, అభినయం, రొమాన్స్, సెంటిమెంట్ సీన్లలో మెప్పించిన తీరు అద్భుతం. కాకపోతే నాని పక్కన మృణాల్ ఠాకూర్ కొంచెం పెద్దదీగా కనిపించింది.

చిన్నారి కియారా ఖన్నా నాని కూతురుగా మహీ పాత్రలో నటించిన నటన గురించి ఏమని చెప్పాలి. న్యాచురల్ స్టార్ పక్కన మరో న్యాచురల్ నటనతో అందరినీ ఆకట్టుకోంది. తెరపైన మొదటి సినిమా ఐనా ఎమోషనల్ సీన్స్ లో ఆ చిన్నారి నటనను ఆస్వాదించాల్సిందే.
Hi నాన్న లో జయరాం పోషించిన పాత్ర విరాజ్ (Nani), యాశ్న (Mrunal Tagoor), మహీ (Kiara Kanna) తర్వాత బాగా గుర్తుండే మరో మంచి పాత్ర. రెండవ అంకం (సెకండ్ ఆఫ్) లో వచ్చే జయరాం క్యారెక్టర్‌కు సంబంధించిన ట్విస్టు సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అందుకే ఆ పాత్ర పేరు రిలేసన్ ఇక్కడ చెప్పదలుచుకో లేదు. సినిమా చూస్తే మీకే అర్దం అవుతుంది.
హాయ్ నాన్న చిత్రంలో విరాజ్ స్నేహితుడు జస్టిన్ ( ప్రియదర్శి), మృణాల్ తల్లి పాత్ర, అలాగే తమిళ నటుడు నాజర్, హిందీ నటుడు అంగద్ బేడీ , బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ తమ పాత్రలతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. అంగద్ బేడీ పోషించిన అరవింద్ పాత్ర సినిమా ముగింపులో వ్యవహరించిన తీరు సిన్మా ని ఫీల్‌గుడ్‌గా మార్చింది.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన మ్యూజిక్ సినిమా ఫీల్ ని చాలా బాగా కన్వే చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఖుషి సినిమా ద్వారా మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చి తను మ్యూజిక్ ఎంత ఎమోషనల్ గా ఉంటుందో రుచి చూపించాడు. కాక పోతే మలయాళ సినిమా హృదయం, తెలుగు లో ఖుషి కి వాడిన ట్యూన్ల లాగే ఉన్నాయి అన్న ఫీల్ వచ్చినా, ఈ మూడు సినిమాల కధలు పాజిటివ్ ఫీల్ మరియు లవ్ & ఎమోషన్ డ్రైవ్ ఉండటం వలన సేమ్ ఫీల్ వస్తుంది.

Hi నాన్నకి సాను వర్గీస్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించారు. కొన్ని సీన్స్ లో ఉపయోగించిన కలర్ ప్యాటర్న్ మూడ్ బాగా క్రియేట్ చేసింది. ఇంకా హీరో నాని పాత్ర ప్రొఫెషన్ ఫోటోగ్రఫీ కాబట్టి, కొన్ని సీన్స్ & షాట్స్ న్యాచురల్ గా కనిపించేలా DoP చాలా జాగ్రత్తలు తీసుకొన్నారు. సినిమా లో చూపించిన ముంబయి, కున్నూర్ ( ఊటీ), గోవా లోకేసన్స్ నీట్ గా న్యాచురల్ గా చూపించారు. అన్నట్టు ఈ సినిమా నాని – సాను వర్గీస్ ల కాంబో లో మూడో సినిమా.

ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ బాగుంది. ఎమోషన్ అండ్ ఫీల్ ఉన్న షాట్స్ పర్ఫెక్ట్ టైమ్ లో పడ్డాయి. పాత్రల నటన తో పాటు ఎడిట్ వలన ఎమోషనల్ ఫీల్ రాబట్టడం లో ఆంటోని ఎడిటింగ్ ఆకట్టుకోంది.
వైరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన్ చేరుకూరి, విజేందర్ రెడ్డి అనుసరించిన నిర్మాణ విలువలు సినిమాను క్లాస్‌గా మార్చింది. ప్రొడ్యూసర్స్ కి ఇది మొదటి సినిమా ఐనా ఖర్చుకి వెనకడకుండా నిర్మించారు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :

Hi నాన్న సినిమా చాలా రోజులు తర్వాత తండ్రి -కూతురు, భార్య – భర్త ల మధ్య ఉన్న కోర్ రిలేసన్స్ ని టచ్ చేస్తూ వచ్చిన మంచి ఎమోషనల్ సినిమా అని చెప్పవచ్చు. చిత్ర దర్శకుడిగా పరిచయమైన శౌర్యువ్ కి ఈ సినిమా డెబ్యూ అయినా తను రాసుకొన్న కథ, కథనాలు అద్బుతంగా తెరపై ఆవిష్కరించడం లో సపలమయ్యాడు అని చెప్పవచ్చు.
ప్రతీ సన్నివేశంలో అమర్చిన సెంటిమెంట్ ఫీల్ ప్రేక్షకుడి హృదయాలను కుదిపేస్తాయి. ఎక్కడో ఓక చోట కళ్ళు చెమ్మగిల్లడం ఆటోమాటిక్ గా జరిగిపోతుంది. చిన్న చిన్న ట్విస్టులతో కధనం డీటైల్ గా రాసుకొని తియ్యడం లో దర్శకుడు మెట్యూరిటీ కనబరిచాడు. ఇటీవల కాలంలో వచ్చిన ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హాయ్ నాన్న చెప్పుకోవచ్చు.
న్యాచురల్ స్టార్ గా నాని ఈ సినిమా తో మరో మెట్టు ఎక్కినట్టే, నని టాప్ 5 సినిమాలలో ఈ Hi నాన్న కూడా ఉంటుంది. ఇంకా మృణాల్ కి కూడా కెరీర్‌లో బెస్ట్ మూవీ గా నిలిచే అవకాశం ఉంది. ఫన్, లవ్, ఎమోషన్స్ కూడిన ఈ Hi నాన్న సినిమా ఫ్యామిలీ తో కలిసి ఉదవచ్చు. థియేటర్స్ లో అందరితో కలిసి చూస్తే మీకున్న ఫీలింగ్ మీ రిలేసన్ తో లేదా ఫ్రెండ్ తో పంచుకొనే అవకాశం ఉంటుంది.
చివరి మాట: నాన్న ఎమోషన్ ని తెర మీద చూసి ఫీల్ అవ్వాలి!
18F RATING: 3.5 / 5
* కృష్ణ ప్రగడ.