భారీ బ్లాక్‌బస్టర్ సినిమా ఐన అఖండ చిత్రాన్ని అందించిన బ్లాక్ బస్టర్ మూవీ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #బోయపాటిరాపోలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్‌తో కూడిన ఈ సినిమాపై ఉన్న అంచనాలను అందుకునేలా బోయపాటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అత్యున్నత నిర్మాణ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌కి జోడిగా ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటి శ్రీలీల నటిస్తోంది. ఈరోజు చిత్ర షూటింగ్‌లో శ్రీలీల జాయిన్ అయ్యింది.
దర్శకుడు బోయపాటి, రామ్ – శ్రీలీలకి సంబంధించిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా లో సంబందించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
బోయపాటి శ్రీను రామ్‌ని మాస్ క్యారెక్టర్‌లో చూపించనున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. టెక్నికల్‌గా, కొంతమంది ఫస్ట్‌క్లాస్ టెక్నీషియన్స్ డిఫరెంట్ క్రాఫ్ట్‌లను చూసుకోవడంతో సినిమా చాలా బలంగా ఉండబోతోంది.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మురాజు నిర్వహిస్తుండగా, సినిమాటోగ్రఫీని సంతోష్ డిటాకే నిర్వహిస్తున్నారు.
#BoyapatiRAPO హిందీ మరియు అన్ని దక్షిణ భారత భాషలలో విడుదల అవుతుంది.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల
సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకుడు: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎస్ థమన్
DOP: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు