“కిల్లర్” నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ ‘రక్తిక’ లుక్ రిలీజ్ !

IMG 20250526 WA0141 e1748272553347

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం.

జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా…విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

IMG 20250526 WA0143

ఈ రోజు “కిల్లర్” మూవీ నుంచి హీరోయిన్ జ్యోతి పూర్వజ్ నటించిన ‘రక్తిక‘ క్యారెక్టర్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పాత్రలో ఆమె వ్యాంపైర్ లుక్ లో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే “కిల్లర్” మూవీ నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది.

“కిల్లర్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు :

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్, తదితరులు

టెక్నికల్ టీమ్: 

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి, మ్యూజిక్ – ఆశీర్వాద్ , సుమన్ జీవ, వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్), లైన్ ప్రొడ్యూసర్ – దశరథ, బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ, నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి, రచన దర్శకత్వం – పూర్వాజ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *