Our divorce was a lie: మా విడాకులు అబద్దం అని తేల్చిచెప్పిన హీరో “శ్రీకాంత్”

Akhanda Srikanth Interview 710db29

“తనూ – ఊహ విడాకులు తీసుకుంటున్నట్లుగా కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వటం పట్ల హీరో శ్రీకాంత్ తీవ్రంగా స్పందించారు. ఈ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండిస్తూ శ్రీ కాంత్ “ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను…!?

గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన ఈ ఫేక్ న్యూస్ ను తన ఫ్రెండ్స్ ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు …ఆందోళన పడవద్దు … అని తనను ఓదార్చాను .

Akhanda Srikanth Interview 11ed741
Hero Meka Srikanth

అయితే ఏవో కొన్ని చిల్లర వెబ్సైట్స్, యూ ట్యూబ్ చానల్స్ వాళ్ళు చేసిన ఈ పని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి అడుగుతుంటే వివరణ ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం.

ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్న వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ” అంటూ హీరో శ్రీకాంత్ ఆ పుకార్లను తీవ్ర స్థాయిలో ఖండించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *