హీరో సత్య దేవ్ చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ టీజర్ !

IMG 20251011 WA0283 e1760181755801

 బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను తాజాగా ప్రముఖ హీరో సత్య దేవ్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్‌.. ‘ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది’ అంటూ ఎంతో పవర్ ఫుల్‌గా సాగిన డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా ప్రారంభించారు.

హీరో ఎంట్రీ.. గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో హీరోయిన్ల ట్రాక్.. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్‌ను గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేశారు.

IMG 20251011 WA0282

మరీ ముఖ్యంగా టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఇక ఈ టీజర్ మణిశర్మ ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉంది. ఇక పార్కింగ్ మూవీ ఫేమస్ జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఈ టీజర్‌లోనే ఇంత గ్రాండ్‌నెస్ కనిపిస్తుందంటే.. సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అర్థం అవుతోంది.

IMG 20251011 WA0281

రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివరాల్ని త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.

తారాగణం:

మాస్టర్ మహేంద్రన్, అంబికావాణి, జాన్ విజయ్, మిమ్‌గోపి, సురేష్‌చంద్ర మీనన్, ఈశ్వర్య లక్ష్మి, తులసి, రాజీవ్ కనకాల, టార్జన్, రామరాజు, బధ్రమ్, జబర్ధస్త్ రాంప్రసాద్, శివన్నారాయణ, దువ్వాసి మోహన్, సుమేత బజాజ్ తదితరులు…

సాంకేతిక సిబ్బంది:

రచయిత & దర్శకుడు : వైకుంఠ్ బోను, నిర్మాత : ధనలక్ష్మి బాదర్ల ,బ్యానర్ : రెయిన్‌బో సినిమాస్, సంగీతం : మణిశర్మ , డి ఓ పి : జిజ్జు సన్నీ (పార్కింగ్ ఫేమ్), లిరిసిస్ట్ : చైతన్య ప్రసాద్, శ్రీ హర్ష ఈమని, ఫైట్స్ : రామకృష్ణ, పీఆర్వో : సాయి సతీష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *