హీరో కిరణ్ అబ్బవరం “దిల్ రూబా” టీజర్ రిలీజ్ ఎప్పుడంటే!

IMG 20241229 WA0265 e1735475919366

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా “దిల్ రూబా“. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

తాజాగా మేకర్స్ “దిల్ రూబా” సినిమా టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 3న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే “దిల్ రూబా” సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “దిల్ రూబా” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. “క” సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా “దిల్ రూబా” పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

నటీనటులు: 

కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు..,

టెక్నికల్ టీమ్:

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ – సామ్ సీఎస్, నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్, రెడ్డి,సారెగమ., రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *