ప్రీ-లుక్ తో ఊపందుకున్న హీరో కార్తికేయ ‘బెదురులంక 2012’ ప్రమోషన్స్!!

SAVE 20221128 191142 e1669691483639

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా విడుదలవనున్న చిత్రం ‘బెదురులంక 2012’.

ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ మరియు టైటిల్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా వినూత్నమైన ప్రీ-లుక్ ని విడుదల చేసి చిత్రం పై అంచనాలని పెంచేసారు.

kartikeya bedurulanka 2012

బుధవారం, నవంబర్ 30న పొద్దున 10:40 కి ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేయనుండగా నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని, సమర్పకులు యువరాజ్ మరియు దర్శకుడు క్లాక్స్ చిత్ర కాన్సెప్ట్ పై చాలా నమ్మకంగా ఉన్నారు.

కార్తికేయ బెదురులంక పోస్టర్

కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర తో పాటు స్ట్రాంగ్ కంటెంట్, కడుపుబ్బా నవ్వించే వినోదం సమపాళ్లలో ఉందని నిర్మాతలు చెబుతున్నారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన పాటలందించగా, దివంగత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ చిత్రంలో ఒక పాట రాయడం విశేషం.

kartikeya bedurulanka 2012 stills

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’ రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన – దర్శకత్వం: క్లాక్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *