Hero Arjun Launches Sahya Movie First Look Poster: హీరో అర్జున్ చేతులమీదుగా  “సహ్య” చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !

Hero Arjun Launches Sahya Movie First Look Poster e1714142195498

సుధా క్రియేషన్స్ బ్యానర్ పై మౌనిక రెడ్డి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సహ్య. సుధాకర్ జుకంటి, భాస్కర్ రెడ్డిగారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాతో యాస రాకేష్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

Hero Arjun Launches Sahya Movie First Look Poster2

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరో అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ… “కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న సహ్య సినిమా పోస్టర్, టైటిల్ అద్భుతంగా గా ఉన్నాయి, మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న ఫీమేల్ లీడ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్నాయి, అదే విధంగా ఈ సహ్య సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు.

Hero Arjun Launches Sahya Movie First Look Poster1

సహ్యా సినిమా టీజర్, ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర దర్శకుడు యాస రాకేష్ రెడ్డి తెలిపారు

Hero Arjun Launches Sahya Movie First Look Poster౩

ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన మౌనిక రెడ్డి భీమ్లా నాయక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది, అలాగే బలగం, రాజాకర్ సినిమాల్లో మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించిన సంజయ్ కృష్ణ సహ్య సినిమాలో మరొక లీడ్ గా నటించారు. రవీందర్ రెడ్డి, సుమన్, భాను, నీలేష్, ప్రశాంత్ తదితరులు ఈ మూవీలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి అరుణ్ కోలుగురి సినిమాటోగ్రఫీ, రోహిత్ జిల్లా సంగీతం సమకూరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *