Hebba Patel Sunil’s Geeta Movie release date locked: “గీత” చిత్రం గురించి వి.వి.వినాయక్ ఏమన్నారు అంటే ?

geeta release date poster

 

గ్రాండ్ మూవీస్” పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. “మ్యూట్ విట్నెస్” అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక.

ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

Geeta film director and VV Vinayak
సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ “తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా “గీత” నిలవాలని” ఆకాంక్షించారు.

వి.వి.వినాయక్ తమ చిత్రం “గీత” ఘన విజయం సాధించాలని అభినందించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు.

ఈనెల 14న “గీత” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Geeta director and VV Vinayak about geeta film
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.

రామ్ కార్తిక్, సప్తగిరి, రాజీవ్ కనకాల, పృథ్వి (30 ఇయర్స్), తనికెళ్ళ భరణి, సంధ్యా జనక్, సూర్య, లలిత, ప్రియ, మీనాకుమారి, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ దుర్గారావు తదితరులు ఇతర పాత్రలుపోసించారు.

గీత  చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: విక్రమ్ రమేష్, డాన్స్: అనీష్, పాటలు: సాగర్, సంగీతం: సుభాష్ ఆనంద్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, పోరాటాలు: రామ్ కిషన్, కళ: జె.కె.మూర్తి, ఛాయాగ్రహణం: క్రాంతికుమార్.కె, కూర్పు: ఉపేంద్ర, కో-డైరెక్టర్: వి.వి.రమణ, నిర్మాత: ఆర్.రాచయ్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విశ్వ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *