క్రిష్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `హరిహర వీరమల్లు` చర వేగంగా షూటింగ్ జరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు.
పవన్ త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయన గ్యాప్ లేకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. అయితే తాజాగా ఇందులోని పవన్ లుక్ లీక్ సోషల్ మీడియా లో ప్రత్యక్షం అయ్యింది.
`హరిహర వీరమల్లు` చిత్రంలోని వీర మల్లు గెటప్ అంటూ సోషల్ మీడియా యోధులు చాలా స్పీడ్ గా వైరల్ చేసేస్తున్నారు.
Latest snap of Veera Mallu 🔥
That beard look ❤️🔥😍@PawanKalyan • #HariHaraVeeraMallu pic.twitter.com/sYA8glEYjF
— Missile PawanKalyan™ (@MissilePSPK) December 6, 2022
విశయం ఏంటా అని మా టీం సోషల్ మీడియా అంతా వేతకగా ఈ సినిమా లో ఓ లేడీ టెక్నీషియన్ షూటింగ్ సెట్‌లో పవన్ కళ్యాణ్‌తో ఫోటో కావాలి అని అడిగితే పవన్ కళ్యాణ్ సున్నితగా కాదనలేక ఫోటో కి పోజ్ ఇచ్చారంట. ఆ లేడి ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇప్పడు పవన్ `హరిహర వీరమల్లు`లొని వీర మల్లు లుక్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో సన్నని గెడ్డంతో పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు పవన్. నుదుటిపై గాయం కనిపిస్తుంది. రెడ్ డ్రెస్ వేశాడు. యుద్ధంలో పాల్గొనే యోధుడిలా ముస్తాబై ఉన్నాడు పవన్.
`హరి హర వీరమల్లు` చిత్రంలోని గెటప్ లో పవన్ కళ్యాణ్ లుక్ ఆద్యంతం కట్టిపడేస్తుంది. అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. గతంలో విడుదల చేసిన `హరి హర వీరమల్లు` ఫస్ట్ గ్లింప్స్ లో కనిపించాడు పవన్. అందులోనూ ఇలాంటి గెటప్‌లోనే ఉన్నాడు. కానీ ఇది మాత్రం అంతకు మించి అనేలా ఉంది.
ప్రస్తుతం పవన్ అభిమానులకు ఈ లీక్ ఫోటో ఫుల్ జోష్‌నిస్తుంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి సినిమాలో ఆయన పాత్ర ఏ రేంజ్‌లో ఉటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇంక `హరి హర వీరమల్లు`సినిమా లో పవన్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నారు. ఇందులో పవన్ వీరమల్లు అనే బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
ఇప్పటికైనా చిత్ర యూనిట్ మేల్కొని, సినిమా యూనిట్ అందరి దగ్గర షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్ లేకుండా తీసుకొంటేనే ఇలాంటి లీక్ లు అరికట్టగలరు. ఈ విశయం లో రాజ మౌళి యూనిట్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. యూనిట్ సబ్యులందరు స్పాట్ కి వచ్చిన వెంటలే సెల్ ఫోన్ లను తీసుకొని ఐ డి కార్డ్స్ ఇస్తారు.