HAPPY BIRTHDAY MRUNAL: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజును సెట్స్ లో సెలెబ్రేట్ చేసిన #VD13 / #SVC54 టీం 

IMG 20230801 WA0222 e1690958434112

 

గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా పరుశురాం తెరకెక్కిస్తున్న మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ (VD13) పదమూడో చిత్రంగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో (SVC54) 54వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ మధ్యే మూవీని అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

దిల్ రాజు, శిరీష్ వంటి వారు ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతోనే దిల్ రాజు, శిరీష్‌లో వాసు వర్మ చేతులు కలిపారు. ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

రీసెంట్‌గా సినిమా టీం అంతా కలిసి లోకేషన్ల వేటను పూర్తి చేశారు. సినిమా లొకేషన్ల రెక్కీ పూర్తయిన సంగతిని మేకర్లు ప్రకటించి.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి ఇప్పుడు షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది.

IMG 20230801 WA0064

మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. సీతారామం సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో నటిస్తున్నారు. నేడు (ఆగస్ట్ 1) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా సెట్‌లో ఆమె బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది చిత్రయూనిట్. సెట్‌లో ఆమె చేత కేక్ కట్ చేయించారు. అనంతరం ఫోటోలకు పోజులు ఇచ్చారు. ఆ ఫోటోల్లో మృణాల్ నవ్వులు చిందిస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. ఈ ఫోటోల్లో యంగ్ నిర్మాత హన్షిత రెడ్డి, శిరీష్‌లు కూడా ఉన్నారు.

IMG 20230801 WA0222 1

నటీనటులు : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్

 

సాంకేతిక బృందం

 

కెమెరామెన్ : కేయూ మోహనన్

సంగీతం : గోపీసుందర్

పీఆర్వో : జీఎస్‌కే మీడియా,వంశీ కాక

ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్

ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్

క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ

కథ, దర్శకత్వం : పరుశురాం పెట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *