Hanuman 100 Days Celebrations Highlights: హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది: హీరో తేజ సజ్జా !

Hanuman 100 Days Celebrations Highlights2 e1713888316669

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హను-మాన్’ 25 కేంద్రాలలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మంచి సెంటర్లలో ఈ హిస్టారికల్ మైల్ స్టోన్ ని చేరుకుంది. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో హను-మాన్ ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మార్కును వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో 5 మిలియన్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రీజనబుల్ టిక్కెట్ ధరలు ఉన్నప్పటికీ, హను-మాన్ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం పాన్ ఇండియాగా విడుదలైంది. ఇది హిందీతో సహా అన్ని భాషలలో కమర్షియల్ హిట్‌గా నిలిచింది. హనుమాన్ విజయవంతంగా వందరోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ గ్రాండ్ గా సెలబ్రేషన్ నిర్వహించింది.

Hanuman 100 Days Celebrations Highlights3

హనుమాన్ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమన్ యాభై రోజుల వేడుక జరిగిన సమయంలో నిర్మాత నిరంజన్ గారు మనం వంద రోజుల వేడుక కూడా చేయగలుగుతామని అన్నారు. కానీ నేను నమ్మలేదు. కాకపొతే మీరంతా దాన్ని నిజం చేశారు. ఇంద్ర, సమరసింహా రెడ్డి, నువ్వునాకు నచ్చావ్, ఖుషి, పోకిరి నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. నేను డైరెక్టర్ అయిన తర్వాత సినిమా అంటే ఒక వీకెండ్ అయిపోయింది. అలాంటి ఈ జనరేషన్ లో వందవ రోజు కూడా థియేటర్స్ కి వచ్చి సినిమా చుస్తున్నారంటే చాలా అదృష్టంగా ఫీలౌతున్నాను.

హనుమాన్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అని మొదటి నుంచి చెప్పాం. దాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా వుంది. ఈ వంద రోజుల్లో ప్రతి రోజు సినిమా తొలి రోజుకు వచ్చిన స్పందనే లభిస్తోంది. ఇంత అదృష్టాన్ని కల్పించిన హనుమంతుల వారికి, రాములవారికి రుణపడి వుంటాను. తేజ, నిరంజన్ గారు, వరు, సముద్రఖని గారు టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పీవీసియు కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇది చాలా కాలంగా కన్న కల. రానున్న ఇరవై ఏళ్ళు దీనిపై స్పెండ్ చేయబోతున్నాను.

Hanuman 100 Days Celebrations Highlights5

ఈ యూనివర్స్ లో మీరు చేసే పాత్రలు మళ్ళీ రాబోతున్నాయి. సముద్రఖని గారు విభీషుడిగా కనిపించబోతున్నారు. తేజ హను- మాన్ గా కొనసాగుతారు. కొన్ని సర్ ప్రైజ్ పాత్రలు కూడా రాబోతున్నాయి. పీవీసియు లో అన్ని పరిశ్రమల నుంచి చాలా పెద్ద స్టార్స్ కనిపించబోతున్నారు. పీవీసియు నుంచి వచ్చే సినిమాలు మీ అందరి అంచనాలు అందుకొని మిమ్మల్ని ఆనందపరుస్తాయి. తెలుగు ఆడియన్స్ గర్వపడేలా చేస్తామని నమ్మకంగా చెబుతున్నాను.

జైహనుమాన్ ని బిగ్గెస్ట్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నాం. గొప్ప ఎమోషన్స్ కనెక్ట్ వీఎఫ్ఎక్స్ అన్నీ వుంటాయి. మీరు ఇలానే సపోర్ట్ చేసి ఆ సినిమాని వంద రోజులు ఆడేలా చేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జైశ్రీరామ్.. జై హనుమాన్’ అన్నారు.

Hanuman 100 Days Celebrations Highlights6
హీరో తేజా సజ్జా మాట్లాడుతూ.. సత్యం థియేటర్లో వంద రోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్ లో హనుమాన్ వంద రోజుల పండగ జరుపుకోవడం ఆనందంగా వుంది. ‘ఈ జనరేష్ లో వంద రోజులు వున్నది నీకే’ ఒకరు మెసేజ్ చేశారు. నిజానికి ఇది నా వంద రోజులు కాదు మీ అందరి వంద రోజులు. ఇది ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్. సముద్రఖని గారు మా సినిమాలోకి వచ్చి సినిమా స్థాయిని పెంచారు.

నిర్మాత నిరంజన్ గారు చాలా గట్స్ వున్న ప్రొడ్యూసర్. గట్స్ వున్న వాళ్ళకే హిట్స్. అలాంటి గట్స్ వున్న నిరంజన్ గారికి హనుమాన్ మొదటి సినిమా కావడం చాలా ఆనందంగా వుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిరంజన్ గారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రేక్షకులకు పాదాభివందనాలు. ఈ విజయానికి కారణం ప్రేక్షకులే. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

Hanuman 100 Days Celebrations Highlights4

సముద్రఖని మాట్లాడుతూ.. ఈ వేడుకని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా వుంది. ఏదైనా మంచి పని చేయాలంటే దేవుని బ్లెస్సింగ్స్ వుండాలి. ఆ దీవెనలే మా అందరినీ ఒక్క చోటికి చేర్చింది. విభీషునిడి పాత్ర చేయాలంటే మామూలు విషయం కాదు. శ్రీరాముని అనుగ్రహం వుండాలి. నాలో ఆ పాత్రని చూశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇంతనమ్మకం పెట్టుకున్న ప్రశాంత్ కి ధన్యవాదాలు. తమ్ముడు తేజ చాలా కష్టపడ్డాడు. అందరం ఇష్టపడి కష్టపడ్డాం. మా నిర్మాతలకు ధన్యవాదలు.టీం అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు లేకపోతే ఈ విజయం లేదు.’ అన్నారు.

Hanuman 100 Days Celebrations Highlights7

నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వంద రోజుల వేడుక నా కాలేజ్ డేస్ లో చూసేవాడిని. నేను నిర్మించిన సినిమా ఇప్పుడు వందరోజుల మైలు రాయిని అందుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ విజయానికి కారణం ప్రేక్షకులు. వారు సినిమాని ఆదరించిన తీరు అద్భుతం. వందరోజుల వేడుక చూస్తుంటే ఇదెక్కడి రెస్పాన్స్ రా మావ అన్నట్టుగా వుంది. ఈ సమ్మర్ లో త్రీడి వెర్షన్ లో వస్తున్నాము. దానికి కూడా ఇదే రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నాము.

మా హీరో తేజ సజ్జా గారు మూడేళ్ళ పాటు చాలా సపోర్ట్ చేశారు. అమృత, వరలక్ష్మీగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అద్భుతమైన పాత్రని పోషించిన సముద్రఖని గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడు ప్రశాంత్ మేము ఈ మూడేళ్ళగా నమ్మినది సాధించాం. మా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కు ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు.

Hanuman 100 Days Celebrations Highlights8

శ్రీమతి చైతన్య మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి నాడు హనుమాన్ వందరోజుల పండగ జరుపుకోవడం చాలా అనందంగా గర్వంగా వుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. నిరంజన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా వత్తిళ్ళు ఎదురుకొన్నారు. ధైర్యంగా నిలబడ్డారు. ఆయన్ని చూస్తుంటే గర్వంగా వుంది. నిరంజన్ పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు ప్రశాంత్ పెంచారు.

Hanuman 100 Days Celebrations Highlights

రాముడికి హనుమంతుడిలా ఎప్పుడూ తోడుగా వున్నారు. వుంటారు. మా సూపర్ హీరో తేజ సజ్జా ఇప్పుడు సూపర్ యోధ. తన నుంచి ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మరింతగా వస్తుందని ఆశిస్తున్నాను. మా టీం అంతా చాలా కష్టపడింది. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవావాదాలు. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *