Hanshika ‘s 105 Minutes Movie First Song Out: హన్సిక 105 మినిట్స్ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల !

IMG 20240109 WA0091 e1704796300714

 

హన్సిక హీరోయిన్ గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా వస్తున్న సినిమా 105 మినిట్స్. గతంలో విడుదలైన మోషన్ పోస్టర్ ఆకట్టుకోగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలైంది.

IMG 20240109 WA0120

మునుపెన్నడు లేని విధంగా మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ మూవీ గా ఈ సినిమా మన ముందుకు వస్తోంది. ఇప్పుడు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ సినిమా పైన ఇంకా ఆసక్తిని పెంచుతోంది.

IMG 20240109 WA0118

ఈ లిరికల్ సాంగ్ ని మొత్తం ఇంగ్లీష్ లిరిక్స్ తో ఒక డిఫరెంట్ ఫీల్ తో మన ముందుకు తీసుకొచ్చారు. సాంగ్ లో హన్సిక లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నువ్వు నా కలవి, నా కోరిక వి, నువ్వు నాకు ఎవరు, ఏమవుతావు, నేను ఇక్కడ లేను, అక్కడ లేను మొత్తం అంతా నేనే అంటూ ఒక డిఫరెంట్ లిరిక్స్ తో ఈ పాట కచ్చితంగా శ్రోతలను అందిస్తుంది.

మోషన్ పోస్టర్ అండ్ లిరికల్ సాంగ్ సినిమా పైన ఆసక్తిని ఇంకా పెంచేస్తున్నాయి.

IMG 20240109 WA0119

కాగా ఈ సినిమాకి సంబంధించి టీజర్, ట్రైలర్ మరియు రిలీజ్ ఈవెంట్ ని మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

 

సాంకేతిక వర్గం:

ప్రొడక్షన్: రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్, నిర్మాత: బొమ్మక్ శివ, దర్శకుడు: రాజుదుస్సా, డి ఓ పి : కిషోర్ బోయిదాపు, సంగీతం: సామ్ సి,ఎస్, పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను ,ధీరజ్ – ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *