నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా ల  “గుర్రం పాపిరెడ్డి” సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ !

IMG 20250502 WA02471 e1746189713489

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి“. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న “గుర్రం పాపిరెడ్డి” సినిమా మోషన్ పోస్టర్ ను ఈ రోజు మేకర్స్ రిలీజ్ చేశారు.

“గుర్రం పాపిరెడ్డి” మూవీ మోషన్ పోస్టర్ పూర్తిగా కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. పర్పెక్ట్ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉండబోతుందో ఈ మోషన్ పోస్టర్ చూపిస్తోంది. డిఫరెంట్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ను హైదరాబాద్ సిటీ బ్యాక్ డ్రాప్ లో కాంటెంపరరీగా, స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు మురళీ మనోహర్. మోషన్ పోస్టర్ లోని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, కామెడీ హైలైట్ గా నిలుస్తున్నాయి.

నటీనటులు:

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు

టెక్నికల్ టీమ్: 

సమర్పణ – డా. సంధ్య గోలీ, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ శ్రీనివాస్), నిర్మాతలు – వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ)  , రచన, దర్శకత్వం – మురళీ మనోహర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *